Bigg Boss 8 Telugu : సీజన్ 8లో ఎలిమినేషన్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. గత వారం నాగ మణికంఠ తాను బిగ్ బాస్ హౌస్లో ఉండలేనని రిక్వెస్ట్ చేసి మరి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. తక్కువ ఓట్లు తెచ్చుకున్న గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ నాగ మణికంఠ అనారోగ్యం కారణంగా వెళ్లిపోతానన్నాడు. దాంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న నాగ మణికంఠ బిగ్ బాస్ ఇంటిని వీడాల్సి వచ్చింది. ఏడో వారం ఎలిమినేషన్ లాగానే ఈ వారం కూడా ఎవిక్షన్‌లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఇప్పుడు అందరిలో అనేక అనుమానాలు కలగజేస్తుంది. ఎనిమిదో వారం నామినేషన్స్‌లో నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ, నయని పావని, మెహబూబ్ ఉన్నారు.
ఎనిమిదో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో లేడి కంటెస్టెంట్ ప్రేరణనే టాప్‌లో దంచికొడుతోంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ప్రేరణ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. టైటిల్ విన్నర్ మెటీరియల్ నిఖిల్ దాటేసి మరి టాప్‌లో ఉంటోంది ప్రేరణ. పృథ్వీ, విష్ణుప్రియ స్థానాలు మారుతున్నాయి. ఒక్కోసారి మూడో స్థానంలో విష్ణుప్రియ ఉంటే.. నాలుగో స్థానంలో పృథ్వీ ఉంటున్నాడు. ఇక ఐదు, ఆరు స్థానాల్లో మెహబూబ్, నయని పావని వరుసగా ఉన్నారు. మెహబూబ్‌కు 9.46 శాతం ఓటింగ్ (1,565 ఓట్లు) వస్తే నయనికి 9.35 శాతం ఓటింగ్ (1,547 ఓట్లు) నమోదు అయింది. ఈ లెక్కల ప్రకారం స్వల్ప ఓట్ల తేడాతో డేంజర్ జోన్‌లో మెహబూబ్, నయని పావని ఉన్నారు.
ఇటీవల గంగవ్వపై యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగవ్వను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి, ఈ వారం గంగవ్వ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలా బిగ్ బాస్ తెలుగు 8 ఎలిమినేషన్‌లో గతం వారం లాగే కన్ఫ్యూజన్ ఏర్పడింది. మెహబూబ్, నయనికి స్వల్ప ఓటింగ్ తేడా మాత్రమే ఉంది. కాబట్టి, చివరన ఎవరు ఉంటారో చెప్పలేం. అలాగే, వీళ్లిద్దరిలో ఒకరు కాకుండా గంగవ్వ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ వారం బిగ్ బాస్ ఎలిమనేషన్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకుంటాయో చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.