Home » Entertainment » Couple Marina And Rohit Fight In Bigg Boss Telugu 6
Entertainment

Bigg Boss 6 Telugu : శ్రీసత్య వలలో పడిపోయిన మరీనా భర్త రోహిత్.. అందరి ముందే రోహిత్ తో గొడవ పెట్టుకున్న మరీనా

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: September 10, 2022, 4:30 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 స్టార్ట్ అయి వారం కావస్తోంది. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయారు. కొందరు గొడవలు పెట్టుకుంటున్నారు. కొందరు చాలా ఆవేశంగా ఉన్నారు. అసలు.. హౌస్ లో ఉన్న 21 మంది 21 రకాలుగా ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో బిహేవియర్. అయితే.. హౌస్ లోకి వచ్చిన 21 మందిలో రోహిత్, మరీనా ఇద్దరూ కపుల్స్. వాళ్లు భార్యాభర్తలు. అందరు వేరు.. వీళ్లు వేరు. ఇద్దరూ పక్కా ప్లాన్ గా ఉండాలి. ఇద్దరూ ఒకరికి మరొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఇదివరకు బిగ్ బాస్ 3 లో వచ్చిన వరుణ్, తన భార్య ఇద్దరూ చాలా సపోర్ట్ గా ఉండేవారు ఒకరికి మరొకరు. కానీ.. ఈ జంట మాత్రం అసలు హౌస్ లోకి అడుగుపెట్టాక.. ఎవరో తెలియని వాళ్లలా గొడవలు పెట్టేసుకుంటున్నారు.

Advertisement

హౌస్ లోకి అడుగుపెట్టాక అసలు మరీనాను పట్టించుకోవడమే మానేశాడు రోహిత్. తనను వదిలేసి.. శ్రీసత్య వెంట పడుతున్నాడు. నిజానికి రోహిత్ కాదు.. శ్రీసత్యే అతడి వెంట పడుతోంది. శ్రీసత్యే అతడితో ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తోంది. అయితే.. రోహిత్ నిజంగానే బాగుంటాడు. హైట్ పర్సనాలిటీ బాగానే ఉంటుంది కానీ.. తనకు పెళ్లి అయింది అనే విషయాన్ని మరిచిపోయాడా? భార్య అదే బిగ్ బాస్ హౌస్ లో ఉందనే విషయాన్ని మరిచిపోయాడా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

Bigg Boss 6 Telugu : శ్రీసత్యతో రోహిత్ క్లోజ్ గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న మరీనా

couple marina and rohit fight in bigg boss telugu 6

Advertisement

రోహిత్, శ్రీసత్య ఇద్దరూ ఎక్కువగా కలిసి ఉండటం, ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండటంతో మరీనాకు తీవ్రంగా అసహనం వేస్తోంది. తనకు ఆ విషయం నచ్చడం లేదు. అసలు రోహిత్ ఎందుకు ఇలా చేస్తున్నాడో మరీనాకు అర్థం కాలేదు. బిగ్ బాస్ హౌస్ కు వచ్చి వారం కూడా కాకముందే ఈ జంట మధ్య గొడవ స్టార్ట్ అయింది. అది కూడా కేవలం శ్రీసత్య వల్లే. తన మాటను రోహిత్ వినడం లేదని మరీనాకు కోపం వస్తోంది. దీంతో నా మొగుడు నాకే టైం కేటాయించడం లేదు అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ లొల్లి ఏంది అంటూ సీరియస్ గానే శ్రీసత్యతో గొడవకు దిగింది మరీనా. ఇన్ డైరెక్ట్ గా రోహిత్ ను వదిలేయ్ అన్నట్టుగా శ్రీసత్యకు వార్నింగ్ ఇచ్చింది మరీనా. ఏందో ఈ బిగ్ బాస్.. చివరకు భార్యభర్తల మధ్య కూడా గొడవ స్టార్ట్ చేశావా బిగ్ బాసూ… ఇంకా మున్ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి