deepthi gives clarity on breakup with shanmukh
Shanmukh : యూ ట్యూబ్ ఫేమస్ కపుల్ దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్ ల జంటపై వస్తున్న బ్రేకప్ పుకార్లకు ముగింపు వచ్చేసింది. అవును అందరూ అనుకుంటున్నట్టు గానే..తాను షన్నుతో విడిపోతున్నట్లుగా ప్రకటించి ఆవేదన వ్యక్తం చేసింది దీప్తి సునయన. తమపై వస్తున్న రూమర్స్ నిజమంటూ క్లారిటీ ఇచ్చేసింది. తామిద్దరం కలిసి చాలా కాలం కలిసి ఉండాలనుకున్నాం కానీ అది కుదరట్లేదంటూ… తమ దారులు వేరు అని తమకు అర్థమయ్యిందంటూ పోస్ట్ పెట్టింది. ఈ కష్ట సమయంలో తనకు అండగా ఉన్న వారందరికీ థాంక్యూ చెప్పింది దీప్తి.దీప్తి సునయన ప్రకటనపై షన్ను కూడా ఇన్ స్టా గ్రామ వేదికగా స్పందించాడు. తనతో బ్రేకప్ అనే నిర్ణయం తీసుకోవడానికి దీపూకి అన్ని హక్కులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.
తాను ఇప్పటివరకు చాలా ఎదుర్కుందని, ఇప్పటికైనా తాను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాని ఆయన తెలిపాడు. 5 ఏళ్ల నుండి తనకు తోడుగా ఉన్నందుకు ఆమెకు థాంక్స్ చెప్తూ.. తాను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.షణ్ముఖ్, దీప్తి సునైనా జంటకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరూ గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరి మధ్య ఇంతకుముందు కూడా గొడవలు వచ్చినా.. మళ్ళీ కలిసిపోయారు. కానీ ఇప్పుడు ఏకంగా విడిపోతున్నట్టు దీప్తి తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టడంతో అందరూ షాకవుతున్నారు.
deepthi gives clarity on breakup with shanmukh
ఇటీవల షణ్ముఖ్ బిగ్ బాస్ లో పాల్గొని వచ్చిన అప్పటినుంచి వీరిద్దరు బ్రేకప్ చేసుకోనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుండి షణ్నూ బయటికి వచ్చినప్పటి నుండి దీప్తి తనను కలవకపోవడం ఈ రూమర్స్‌కు మరింత ప్రాణం పోసింది. ఇక అంతా అనుకున్నట్లు గానే వీరు ఇప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించి నూతన ఏడాది రోజే వారి అభిమానులను నిరాశ పరిచారు. బిగ్ బాస్ హౌజ్ లో షన్ను.. తన స్నేహితురాలు సిరితో కలసి చేసిన ప్రేమ వ్యవహారమే ఇందుకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఇక మరివైపు దీప్తి లాగే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇక రేపో మాపో వారి బ్రేకప్ వార్త కూడా వినాల్సి వస్తుందా అని అంతా చర్చించుకుంటున్నారు.
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
This website uses cookies.