deepthi sunaina shocking comments on shanmukh in Bigg boss 5 Telugu show
shanmukh : బిగ్ బాస్ షో లో ప్రతిసారి ఏదో ఒక పెయిర్ హైలెట్ అవుతూ రావడం సాధారణమే. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయా జంటలు బయట ఎలా ఉంటాయనేది వారి వ్యక్తిగతం అయినప్పటికీ షో లో ఉన్నంత వరకు మాత్రం వారు నిజంగానే ప్రేమికులేమో అనిపించేంతగా ఉంటుంది వారి వ్యవహారం. అయితే ఈసారి సీజన్ 5 లో అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నది సిరి, షణ్ముఖ్ ల బంధం గురించే. బిగ్ బాస్ కంటే ముందునుంచే స్నేహితులైన వీరు…హౌస్ లోకి వచ్చాక బాగా క్లోజ్ అయ్యారు. ఓ రోజు గొడవపడతారు. ఆ మరుసటి రోజే మళ్ళీ రోజు క్లోజ్ అయిపోతారు. అలగటాలు, హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంటారు. ఒక పక్క మేం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే.. అసభ్యంగా రొమాన్స్ చేస్తుంటారు.
ఓ వైపు ఇంటి సభ్యులు, మరోవైపు బయటి ప్రేక్షకులు వీళ్ళ గురించి అర్ధం కాక తల పగలకొట్టుకున్నారు.షన్నుకి షో లోకి రాకముందు ఎంత పేరున్నా ఇంట్లోకి వచ్చాక మాత్రం ఆయన మీద పూర్తి నెగెటివిటీ ఏర్పడింది. సిరితో హగ్గులు, సిరిని పెట్టిన టార్చర్, ట్రిప్ అవుతున్నానంటూ షణ్ముఖ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అలా సిరి ట్రాక్‌తో షన్నుకి విపరీతమైన బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది. క్రమక్రమంగా ఇది అతని ఓటింగ్ పై ప్రభావం చూపింది. మొదటినుంచీ టాప్ ఓటింగ్ తో దూసుకు వచ్చిన షణ్ముఖ్ నే విన్నర్ అని అంతా అనుకున్నారు. కానీ అతను ఇప్పుడు రన్నర్ గా కూడా పోటీ పడటం లేదని పలు ప్రైవేట్ వెబ్ సైట్ ఓటింగ్ ప్రకారం తెలుస్తోంది.అయితే షన్ను రోజురోజుకీ మరింత బ్యాడ్ అవుతూ వస్తుండటంతో తన ప్రియురాలు దీప్తి సునయన రంగం లోకి దిగింది.
deepthi sunaina shocking comments on shanmukh in Bigg boss 5 Telugu show
ఓటింగ్ కు కొద్ది రోజులే మిగిలి ఉండటంతో.. షన్ను వ్యక్తిత్వం తను పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరు ఏదో ఒక నిర్ణయానికి రాకండి.. బిగ్ బాస్ షోను చూసి పూర్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకండి.. అది షో అని గుర్తు పెట్టుకోండి.. షన్ను చాలా మంచివాడు.. అంటూ ఆడియన్స్ కు సూచించింది. షన్ను ఏం చేయాలని అనుకుంటున్నాడో అది చేయనివ్వండి. మీ అంచనాలకు తగ్గట్టుగా అతను రీచ్ అవ్వాలని అనుకోకండని తెలిపింది. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేసుకోండి అని ఉచిత సలహాలు ఇస్తూ.. మీకు నచ్చినట్టు కాకుండా వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి.. నేను మాత్రం షన్నుకే మద్దతు ఇస్తానని పేర్కొంది. చివరగా తనకు తన ప్రేమికుడి సంతోషమే విలువైనదని చెప్పుకొచ్చింది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.