Home » Entertainment » Devullu Movie Child Artist Present Photo
Entertainment

Devullu : దేవుళ్ళు సినిమాలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

Authored By
aruna
The Telugu News | Published on: July 30, 2022, 5:40 pm
Advertisement

Devullu : దేవుళ్ళు సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తే ఉండుంటుంది. ఈ సినిమా వచ్చి 20 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ప్రేక్షకులు టెలివిజన్లో వస్తే తప్పకుండా చూసేవారు చాలామంది ఉన్నారు. ఈ సినిమాను డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా పృథ్విరాజ్, రాశి నటించారు. ఈ చిత్రంలో వాళ్లకు ఇద్దరు పిల్లలుగా ఇద్దరు చిన్నారులు నటించారు. వారిద్దరిలో ఒక పాప పేరు నిత్య మరియు బాబు పేరు నందన్. అమ్మానాన్నల ప్రేమ కోసం పరితపించి పోయే పిల్లలుగా నిత్య మరియు నందన్ చాలా బాగా నటించారు. ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిండిపోయారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిన్నారుల నటనకు ఎంతోమంది పిల్లలు ముగ్ధులయ్యారు. ఇప్పటికి చాలామంది పిల్లలు ఈ సినిమా వస్తే చూడకుండా అస్సలు ఉండలేరు. అంతలా ఆకట్టుకుంది ఈ సినిమా.

Advertisement

దేవుళ్ళు సినిమాలో మీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ ఓ పాట వస్తుంది. ఆ పాట ఇప్పటికీ ఎంతోమంది వింటారు. ఈ పాటలో బేబీ నిత్యా మరియు మాస్టర్ నందన్ అమ్మానాన్నల ప్రేమ కోసం పాడే పాట ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన బేబీ నిత్యాశెట్టి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. పిట్ట కథ అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడం జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నిత్య చేసిన ‘ దేవుళ్ళు ‘ సినిమా ఆమెకు నటన పరంగా మంచి పేరును సంపాదించి పెట్టింది.

Devullu movie Child artist present photo

Advertisement

ఇప్పుడు చాలామంది నిత్య అంటే గుర్తుపట్టలేరు కానీ దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ప్రేక్షకులు బాగా గుర్తుపట్టగలరు. హీరోయిన్ గా నిత్యాశెట్టి చేసిన మొదటి సినిమా పిట్ట కథ. ఈ సినిమా ఆమెకు అనుకున్నంత విజయాన్ని సాధించి పెట్టలేదు కానీ నటన పరంగా మంచి పేరును తెచ్చిందని చెప్పాలి. అయితే ఇప్పుడు నిత్యను చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు. హీరోయిన్ గా అయినా దేవుళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ నిత్యాశెట్టి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు దేవుళ్ళు సినిమా లోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా బాగుంది అని అనుకుంటున్నారు.

Devullu movie Child artist present photo

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి