Home » Entertainment » Dhee Fame Pandu In Suma Cash Show
Entertainment

Dhee Fame Pandu : ఢీ కంటెస్టెంట్ పండు పరువుపాయే.. అందరూ అలా పిలవడంతో షాక్!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 15, 2021, 3:00 pm
Advertisement

Dhee Fame Pandu : నీ పక్కన పడ్డాదో లేదో సూడవే నాదీ నక్కిలీసు గొలుసు అంటూ ఢీ షోలో పండు వేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఏ లెవెల్‌లో క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ దెబ్బతో పండు, టిక్ టాక్ దుర్గారావు, నక్కిలీసు గొలుసు పాట, మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచే ఇలా అందరూ ఫేమస్ అయ్యారు. ఒక నెల పాటు ఈ పాట మార్మోగిపోయింది. పండు వేసిన స్టెప్పులు హైలెట్ అయ్యాయి. ఆ పాట నుంచి పండు క్రేజ్ మారిపోయింది. దాదాపు ప్రతీ చానెల్‌లో ఆ స్టెప్పులు వేసేశాడు.

Advertisement

Dhee Fame Pandu In Suma Cash Show

ఢీ కంటెస్టెంట్ పండు పరువుపాయే.. Dhee Fame Pandu

అలా పండు బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలా ఇప్పుడు డ్యాన్సర్‌గానే కాకుండా.. ఆర్టిస్ట్‌గాను దుమ్ములేపుతున్నాడు. జబర్దస్త్ షోలో పండు చేసే కామెడీ బాగానే ఉంటుంది. ఇక పెళ్లి కోసం ఆరాటపడే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లా పండు కష్టాలను బుల్లితెరపై స్కిట్ల రూపంలో చూపిస్తుంటాడు. అయితే ప్రతీ సారి పండు పరువుపోతోంది. వచ్చిన ఆర్టిస్ట్‌, గెస్టులు పండు పెళ్లి గురించి కామెంట్ చేస్తుంటారు.. వాడి ప్రయత్నాలను చెడగొడుతుంటారు.

Advertisement

Dhee Fame Pandu In Suma Cash Show

అలా తాజాగా రాఖీ స్పెషల్ అంటూ క్యాష్ షోలో అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లు వచ్చారు. ఇందులో సింగర్ సాకేత్ తన సోదరి సోనితో కలిసి వచ్చాడు. ఇక పండు తన చెల్లితో వచ్చాడు. కానీ పండు కన్ను మాత్రం సాకేత్ సోదరిపై పడింది. ఆమెను పటాయించడానికి ట్రై చేశాడు. కానీ ఆమెతోనే రాఖీ కట్టించి అన్నయ్యా అని పిలిపించి గాలి తీశారు. ఇక అక్కడున్న అమ్మాయిలందరితోనూ రాఖీ కట్టించేసి అన్నయ్యా అని పిలిపించడంతో పండు షాక్ అయ్యాడు.

ఇది కూడా చ‌ద‌వండి ==> బిగ్‌బాస్‌లోకి పాపులర్ డ్యాన్స్ మాస్టర్ కపుల్ ఎంట్రీ..పోల్ పెట్టిమరీ లీక్ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> తమన్నాకి అదంటే బాగా ఇష్టమట..నెలకి ఎన్నిసార్లు వెళుతుందో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆహా ఏమీ అందం చీరకట్టిన చందమామ !!.. యాంకర్ విష్ణుప్రియ పిక్స్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> హైపర్ ఆదికి అవమానం.. స్టేజ్ మీదే బట్టలు చించేశారు !

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి