Home » Entertainment » Dhee Fame Sai Nainika Performance Promo Viral
Entertainment

Sai Nainika : ఢీ ఫేమ్ సాయి నైనిక బ్రేకప్?.. అందుకే అలా అన్నాడా?

Authored By
aruna
The Telugu News | Updated on: September 17, 2022 7:23 pm
Advertisement

Sai Nainika : ఢీ షోలో డ్యాన్సులు తప్పా మిగతావన్నీ ఉంటున్నాయ్ అనే అపవాదు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో పిచ్చి పిచ్చి ట్రాకులు, లవ్ స్టోరీలు, కుళ్లు జోకులుంటున్నాయనే కంప్లైంట్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే డ్యాన్సులు చేయమంటే జిమ్నాస్టిక్ స్టంట్లు చేస్తుంటారు కంటెస్టెంట్లు. వాటినే డ్యాన్స్ అని భ్రమపడేలా చేస్తున్నారు. ఇక కుర్చీలో కూర్చున్న జడ్జ్‌లు సైతం వాటినే డ్యాన్సులు అనుకుంటున్నారు. ఈ పైత్యాలు చాలవన్నట్టుగా రొమాంటిక్ ట్రాకులు, లవ్ స్టోరీలను ప్రమోట్ చేస్తుంటారు.

Advertisement

అలానే నైనిక సాయి జోడిని బాగా పాపులర్ చేసింది ఢీ టీం. స్టేజ్ మీద రొమాన్స్ చేసే స్థాయికి వారిని తీసుకొచ్చింది. ఈ ఇద్దరూ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు వేస్తుంటే.. హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతోంటారు. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం లేదు. వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, విడిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరూ కలిసి ఓ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇందులోనూ సాయి ఓ డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్‌ను సాయి చేత పదే పదే చెప్పించారు. ఆది సాయి కలిసి చేసిన ఈ కామెడీలో ఓ నిజం కూడా ఉన్నట్టుంది.

Dhee fame Sai Nainika Performance Promo Viral

Advertisement

సాయి అంటే నైనికకు ఇష్టం లేదని, ఇదే విషయాన్ని నేరుగానే చెప్పినట్టు తెలుస్తోంది. అమ్మాయిలు మైండ్‌లో లేమని చెప్పారనుకో.. గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాం.. కానీ హార్ట్‌లోనే లేమని చెప్పినప్పుడు తట్టుకోవడం కష్టం అని సాయి అన్నాడు. ఇదే మాటను ఆది పదే పదే చెప్పించాడు. అయితే ఇందులో నైనిక మీదే సాయి కౌంటర్లు వేసినట్టు తెలుస్తోంది. నైనిక మనసులో సాయి లేడని అర్థమవుతోంది. ఇదే విషయాన్ని నైనిక నేరుగా సాయికి చెప్పినట్టుంది. దీంతో సాయి ఇలా అన్నాడా? అని అనిపిస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి