దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని చేస్తున్నాడు. దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టిన కెరీర్ ఆ తర్వాత నిర్మాతగా మారి ఇండస్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని నిర్మించాడు. అంతేకాదు దాదాపు అందరు స్టార్ హీరోలతోను సినిమాలు నిర్మించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న వకీల్ సాబ్ బ్యాలెన్స్ టాకీ పార్ట్ ని కంప్లీట్ చేస్తుండగా తాజాగా సక్సస్ ఫుల్ కాంబినేషన్ లో ఎఫ్ 3 సినిమా ని ప్రారంభించాడు దిల్ రాజు.
ఎఫ్ 2 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఒక సీనియర్ హీరో ఒక యంగ్ హీరోతో భారీ మల్టీస్టారర్ గా ఎఫ్ 2 వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకి కొనసాగింపుగా ఎఫ్ 3 తెరకెక్కబోతోంది. ఈ సీక్వెల్ లో కూడా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమన్న భాటియా, మెహ్రీన్ జంటలుగా నటిస్తున్నారు. అలాగే మరో హీరో కూడా ఈ సినిమాలో నటించబోతుండగా ఆ హీరో ఎవరన్నది త్వరలో వెల్లడించనున్నారని సమాచారం. ఎఫ్ 2 లో చూసిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కంటే డబుల్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ని దర్శకుడు అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు.
కాగా తాజా ఈ సినిమా ఓపెంగ్ కార్యక్రమాలను నిర్వహించారు దిల్ రాజు బృందం. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ తమన్నా తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సినిమా కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇలా పూజా కార్యక్రమాలను నిర్వహించారో లేదో అలా బిజినెస్ కూడా క్లోజ్ చేసేశాడట దిల్ రాజు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి డిజిటల్ రైట్స్ ఇచ్చేయగా శాటిలైట్ రైట్స్ ని మాటీవీ కి ఇచ్చేందుకు చర్చలు సాగుతున్నాయట. మొత్తానికి దిల్ రాజు ఈ సినిమాని షూటింగ్ మొదలు పెట్టకుండానే బిజినెస్ క్లోజ్ చేయడం చూసి అందరూ షాకవుతున్నారట.
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
This website uses cookies.