director shankar plans song for ram charan in new zealand with high budget
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో ప్రస్తుతం ఓ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 15 వ మూవీ అది. అందుకే దానికి ఆర్సీ 15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లేవల్ లో వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్ రాజమండ్రి, హైదరాబాద్ లో పూర్తి అయింది. తదుపరి షెడ్యూల్ న్యూజిలాండ్ లో ఉండబోతోంది.
దాని కోసం ఒక పాటను అక్కడ తెరకెక్కించబోతున్నారు. న్యూజిలాండ్ లో తెరకెక్కించబోయే పాటను ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. రామ్ చరణ్, కియారా అద్వానీ మీద ఓ సాంగ్ ను అక్కడ షూట్ చేయనున్నారట. అది రొమాంటిక్ సాంగ్ కావడంతో దానికి బెస్ట్ లొకేషన్ గా న్యూజిలాండ్ ను ఎంచుకున్నారట. కేవలం ఈ పాట కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదట మూవీ యూనిట్. కేవలం ఆ పాట షూట్ కోసం రూ.23 కోట్లను ఖర్చు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఒక పాట కోసం ఇంత ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు.
director shankar plans song for ram charan in new zealand with high budget
కానీ.. ఈ సినిమాలో మాత్రం ఆ పాట కోసం ఏకంగా అంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. మరి.. అంత ఖర్చు పెట్టేంతగా ఆ పాటలో ఏముంటుందో తెలియాలంటే ఆ సినిమా విడుదలయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఒక పొలిటికల్ త్రిల్లర్ గా వస్తోంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. అంతే కాదు.. రామ్ చరణ్ ఈ సినిమాల్లో డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఎన్నికల కమిషనర్ గా కనిపించబోతున్నాడు.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.