DJ Tillu hero gets trolled by anchor Pradeep mother
DJ Tillu : సిద్ధు జొన్నలగడ్డ ఈ పేరు చెబితే వెంటనే డీజే టిల్లు సినిమా గుర్తొస్తుంది. సిద్ధూ పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తాజాగా డీజే టిల్లు అనే సినిమా చేశారు. నాగ చైతన్య జోష్ సినిమాతో ఆయన తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఇటీవల వచ్చిన డీజే టిల్లు చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించాడు. ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. అంతేకాదు అటు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షల్స్‌ను రాబట్టింది. ఈ సినిమా అక్కడ 65 లక్షల రేంజ్ లో బిజినెస్ చేయగా.. ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే 1 కలెక్షన్స్ తో అమెరికాలో 200K డాలర్స్ మార్క్ ని అందుకోని అదరగొట్టింది. డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న డీజే టిల్లు తనతో పాటు తన తల్లిని కూడా తీసుకొచ్చారు. ఎంతోమంది బుల్లితెర నటీనటులు మధ్య కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పైన సిద్ధు జొన్నలగడ్డ తన తల్లి చేత దారుణంగా తిట్లు తిన్నారు.
ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరి వస్త్రధారణ విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రస్తుతం టామ్ జీన్స్ ధరించడానికి ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి ప్యాంట్ ధరించిన సిద్దు జొన్నలగడ్డను చూపిస్తూ యాంకర్ ప్రదీప్ మీ అబ్బాయి ధరించిన ప్యాంటు చూస్తే మీకేమనిపిస్తుంది అంటూ హీరో తల్లిని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఆమె సమాధానం చెబుతూ ఈ కాలంలో పిల్లలు ధరించే వస్త్రధారణ గురించి మా జనరేషన్ వారికి ఎప్పటికీ అర్థం కాదని చెప్పారు. అప్పట్లో దుస్తులు చినిగి పోతే కుట్టుకొని మరి వేసుకునే వాళ్ళం అంటూ అవమానించారు.
DJ Tillu hero gets trolled by anchor Pradeep mother
అదే విధంగా ప్రస్తుత కాలంలో పిల్లలు చాలా మంది వారి డబ్బును వృధాగా ఖర్చు చేస్తున్నారు అంటూ ఈమె మాట్లాడారు. ఈ విధంగా సిద్దు జొన్నలగడ్డ తల్లి మాట్లాడటంతో ప్రదీప్ తిడుతున్నటున్నారు బయ్యా అని అనగా మరి ప్రతిరోజూ నాకు ఎలా ఉంటుందో తెలుసా అంటూ సిద్ధు జొన్నలగడ్డ ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధంగా ఈ వేదికపై తన తల్లి సరదాగా తన కొడుకుని తిట్టడంతో అక్కడున్న వారందరూ కూడా ఎంతగానో నవ్వుకున్నారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.