Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ తెలుగు వెండితెరపై చివరగా ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో కనిపించాడు. ఆ ఫిల్మ్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైన తారక్ కనబడలేదు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో తెలంగాణ గిరిజన యోధుడు కొమురం భీం పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్ర విడుదల కరోనా వలన పోస్ట్ పోన్ అయింది. మార్చి 18న లేదా ఏప్రిల్ 28న పిక్చర్ రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈ మూవీ తర్వాత తారక్ లైనప్ మూవీస్ చూస్తే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోతారు.‘ఆర్ఆర్ఆర్’ షూట్ పూర్తి కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి అందరికీ విదితమే.
వీరిరువురి కాంబోలో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మూవీ సూపర్ హిట్ అయింది. యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేయనున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో కంప్లీట్ యాక్షన్ మూవీ ఉండబోతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ చిత్రం పూర్తి కాగానే తారక్..కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం.
ఇప్పటికే మూవీ స్టోరిని అట్లీ తారక్‌తో చెప్పారని కూడా వార్తలొస్తున్నాయి. మొత్తంగా తారక్.. క్రేజీ డైరెక్టర్స్‌తో మూవీస్ చేస్తూ తన ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా చేయబోతున్నారని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎలాగూ పాన్ ఇండియా వైడ్ మార్కెట్ తారక్ కు ఏర్పడుతుంది. ఇక ఆ ఫిల్మ్ తర్వాత చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ సినిమాలు కాబట్టి.. తారక్ దేశవ్యాప్తంగా ఫేమస్ హీరో అయిపోతాడని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.