Yuvraj Singh :భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. దేవుడు మాకు కుమారుడిని ప్రసాదించాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు. లవ్, హాజెల్, యువరాజ్ అంటూ యువీ చేసిన పోస్ట్ కొద్ది నిమిషాలలోనే వైరల్‌గా మారింది. యువరాజ్ సింగ్ తండ్రి అయినందుకు అందరు అభినందనలు తెలుపుతున్నారు.
2011లో యువరాజ్ సింగ్, హజెల్ కీచ్ ఇద్దరికీ ఓ పార్టీలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్ళికి దారి తీసింది. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన 2011 సూపర్ హిట్ చిత్రం ‘బాడీగార్డ్’లో కరీనా కపూర్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో హాజెల్ నటించింది. అంతేకాకుండా పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్ 7లో కూడా పాల్గొంది. కొన్నాళ్లు డేటింగ్ తర్వాత ఈ ఇద్దరు పెళ్లి పీటలెక్కారు. వీరి పెళ్లి కూడా సైలెంట్‌గానే జరిగింది.యువరాజ్ అక్టోబర్ 2000లో కెన్యాపై వన్డేల్లో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. చివరిసారిగా జూన్ 2017లో వెస్టిండీస్‌తో ఆడాడు.
304 వన్డేల్లో అతను 14 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలతో సహా 55 సగటుతో 8701 పరుగులు చేశాడు. అదే సమయంలో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 58 టీ20ల్లో 1177 పరుగులు అతని పేరు మీద ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2007, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో హీరోగా నిలిచిన యువరాజ్ 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 T20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్‌పై ఒక ఓవర్‌లో 6 బంతుల్లో అతను 6 సిక్సర్లు బాదడం అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. 2022 ఫిబ్రవరి నుంచి క్రికెట్ మైదానంలోకి తిరిగి రావాలని యువరాజ్ సింగ్ భావిస్తున్నాడు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.