Home » Entertainment » Do You Know Shakeela Remuneration In Bigg Boss Telugu 7
Entertainment

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ 7లో షకీలా షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్క రోజుకి ఎంతో తెలిస్తే మతిపోతుంది

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 5, 2023, 8:00 pm
Advertisement

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ 7 తెలుగు ఇటీవల ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈసారి సీజన్ లో 15 మంది కంటెస్టెంట్లు ఉంటారని చెప్పారు. కానీ.. ఇప్పటి వరకు మాత్రం 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఇక మరో వ్యక్తి సడెన్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. మధ్యలో మరో కంటెస్టెంట్ ను తీసుకొచ్చినా తీసుకొస్తారు. ఇక.. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 14 మందిలో ఎక్కువ మంది సినిమా రంగానికి చెందిన వారే. ఒక్క పల్లవి ప్రశాంత్ తప్ప. అతడొక్కడే రైతు బిడ్డ. రైతు బిడ్డను ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.

Advertisement

అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్లలో ఎక్కువ పాపులారిటీ ఉన్నవాళ్లు అంటే షకీలా అనే చెప్పుకోవాలి. షకీలాను బిగ్ బాస్ 7 లోకి తీసుకొంటున్నారని ముందు నుంచే వార్తలు వచ్చాయి. అవి ఇప్పుడు నిజం అయ్యాయి. షకీలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. అయితే.. షకీలాకు ఈ తరం గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 80లో 90లో పుట్టిన కిడ్స్ కి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియాను మొత్తం ఆమె ఒక ఊపు ఊపేసింది. అందుకే బిగ్ బాస్ లోకి ఇప్పుడు తీసుకున్నారు. ప్రస్తుతం షకీలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో తనను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

do you know shakeela remuneration in bigg boss telugu 7

Advertisement

Bigg Boss Telugu 7 : ఒక్క రోజుకు తనకు ఎంత పారితోషికం ఇస్తున్నారంటే?

అయితే.. బిగ్ బాస్ హౌస్ లో రోజులను బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది. రోజుకు ఇంత అని ఇస్తారు. ఎక్కువ పాపులారిటీ ఉన్నవాళ్లకు ఎక్కువ రెమ్యునరేషన్, లేని వాళ్లకు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఒక్కో విధంగా ఉంటుంది. అయితే.. షకీలాకు మాత్రం రోజుకు లక్ష రూపాయలు ఇస్తున్నారట. అంటే.. తను హౌస్ లో ఎన్ని రోజులు ఉంటే అన్ని లక్షలు అన్నమాట. ఒకవేళ తను ఈ ట్రోఫీని గెలిస్తే.. దానికి అదనంగా రూ.50 లక్షలు ఇస్తారు. మొత్తం మీద తనకు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా షకీలా బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వల్ల బిగ్ బాస్ కి చాలా ప్లస్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి