do you know shobana brother Big star
Shobana : సీనియర్ హీరోయిన్ శోభన గురించి సినీ ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సౌత్ ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్‌లో మూవీస్ చేసిన అలనాటి అగ్రతారలందరి సరసన హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఎక్స్ పోజింగ్‌కు దూరంగా ఉంటూ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శోభన.శోభన..క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. ఈ నేపథ్యంలోనే ఆమె వెండితెరపై డ్యాన్స్ చేస్తున్నపుడు చేస్తే ప్రేక్షకులకు అత్యద్భుతంగా అనిపిస్తుంది.
do you know shobana brother Big star
టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించిన శోభన దక్షిణ భారతదేశానికి చెందిన చాలా మందికి క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణనిచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన శోభన ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోకపోవడం గమనార్హం. శోభ ఓ పాపను దత్తత తీసుకుని తన పాపగా పెంచుకుంటోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. స్టార్ హీరో వినీత్.. శోభన తమ్ముడన్న సంగతి దాదాపుగా చాలా మందికి తెలిసి ఉండదు. అప్పట్లో అబ్బాస్, వినీత్ కలిసిన నటించి ‘ప్రేమదేశం’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో వినీత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ చిత్రంలో టబు హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది ఆ ఫిల్మ్. దాని తర్వాత వినీత్ దక్షిణ భారతదేశంలోని పలు చిత్రాల్లో నటించాడు. వినీత్ కూడా క్లాసికల్ డ్యాన్సరే.
do you know shobana brother Big star
చిన్న నాటి నుంచి భరత నాట్యం పట్ల ఆసక్తి పెంచుకున్న వినీత్.. భరత నాట్యంలో ఎన్నో ప్రదర్శనలూ ఇచ్చాడు. వినీత్ తెలుగు భాషలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలు పొందాడు. వినీత్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. అయితే, సీనియర్ హీరోయిన్ శోభన మాత్రం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. 2020లో ఈమె ఓ మలయాళ చిత్రంలో నటించి మాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చి.. నటిగా మళ్లీ నిరూపించుకుందని చెప్పొచ్చు.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.