Home » Entertainment » Emmanuel In Recipodham Brother Show
Entertainment

Emmanuel In Recipodham : వర్షను సైడ్ చేసేశాడు.. కొత్త బ్యూటీతో ఇమాన్యుయేల్ రొమాన్స్

Authored By
aruna
The Telugu News | Published on: October 19, 2021, 5:00 pm
Advertisement

Recipodham Brother : బుల్లితెరపై వర్ష ఇమాన్యుయేల్ జోడి ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో వర్ష ఇమాన్యుయేల్ గురించి వార్తలు రాని రోజంటూ లేకుండా అలా నిత్యం హాట్టాపిక్‌గా మారారు. అయితే అది కాస్తా అతి వల్ల వెగటు పుట్టేసింది. ఈ ఇద్దరికీ మల్లెమాల టీం పెళ్లి చేసే ఈవెంట్ కూడా ఏర్పాటు చేసింది. పండుగ స్పెషల్ ఈవెంట్ కోసం ఈ ఇద్దరికి పెళ్లిచేశారు. దానికి వర్ష ఇచ్చుకున్న ప్రమోషన్ కూడా బాగా ప్రభావం చూపించింది.

Advertisement

Emmanuel In Recipodham Brother Show

ఆ జోడి మీద నానా రకాలుగా కామెంట్లు చేసి పరువుతీశారు. అప్పటి నుంచి మళ్లీ ఇలాంటి పిచ్చి పిచ్చి స్కిట్లు వేయడం మానేశారు. లవ్,పెళ్లి, రొమాన్స్ అంటూ స్కిట్లు వేయడం లేదు. మధ్యలో కొన్ని రోజులు అయితే ఈ ఇద్దరూ ఒకే స్కిట్లో కనిపించే వారు కూడా కాదు. అయితే ఇప్పుడు మళ్లీ యథావిథిగా కలిసి స్కిట్లు చేస్తున్నారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ ఇలా అన్ని షోల్లోనూ వారే కనిపిస్తున్నారు.

Advertisement

Recipodham Brother: వర్షను వదిలిన ఇమాన్యుయేల్

Emmanuel In Recipodham Brother Show

అయితే తాజాగా ఇమాన్యుయేల్ రెచ్చిపోదాం బ్రదర్ షోలో వర్షను పక్కన పెట్టేశాడు. వేరే కొత్త బ్యూటీతో రొమాన్స్ చేస్తున్నాడు. నా జీవితంలో నీ ఒక్క దానికే చోటు అంటూ డైలాగ్స్‌లు కొట్టేశాడు. మరి వర్ష సంగతి ఏంటి? అంటూ ఆ అమ్మాయి అడుగుతుంది. ఇది ఏ కాలం అని ఇమాన్యుయేల్ అంటాడు. చలి కాలం అని చెబుతుంది. చలి కాలంలో వర్ష ఎక్కడుంటుంది అంటూ కౌంటర్ వేశాడు. మొత్తానికి ఇమాన్యుయేల్ మాత్రం కొత్త బ్యూటీతో బాగానే రొమాన్స్ చేస్తున్నాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి