Jabardasth Varsha : బుల్లితెరపై వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ ఎప్పటికీ ట్రెండింగ్‌గానే ఉంటుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌ను జనాలు ఇష్టపడుతుంటారు. కానీ మధ్య మధ్యలో వీళ్లు చేసే అతి మాత్రం మామూలుగా ఉండదు. దీంతో జనాలకు అప్పుడప్పుడు వీళ్ల మీద చిర్రెత్తుకొస్తుంటుంది. కావాలనే కొన్ని సందర్భాల్లో స్టేజ్ మీద అతి చేస్తుంటారు. ఇక అది వారి తప్పుకాదనుకోండి. డైరెక్షన్ టీం చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే పేరు మాత్రం, ఇమేజ్ మాత్రం ఇమాన్యుయేల్, వర్షలకు వస్తుంటాయి. కాబట్టి తిట్లు కూడా వారికే పడుతుంటాయి. అలా ఇమాన్యుయేల్ ఇది వరకు స్టేజ్ మీదనే ఎన్నో సార్లు వర్షను వదిలేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. కొత్త బ్యూటీలు ఎవరైనా స్టేజ్ మీదకు వస్తే.. ప్రతీసారి ఇమాన్యుయేల్ అవే మాటలు చెబుతుంటాడు..
ఇక నాకు వర్ష వద్దు.. నువ్వే కావాలి.. నీతోనే ఉంటాను.. నువ్ లేకపోతో చచ్చిపోతాను అనే రొటీన్ డైలాగ్స్ చెబుతుంటాడు. అయితే ఇప్పుడు కూడా వర్షను వదిలేసి మంచి రొమాంటిక్ హీరోయిన్‌ను పట్టుకున్నాడు ఇమాన్యుయేల్. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో ఇమాన్యుయేల్ రెచ్చిపోయాడు. రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మలు ప్రోగ్రాంకు వచ్చారు. ఇక దీంతో కేతిక శర్మను చూసి ఇమాన్యుయేల్‌కు పిచ్చెక్కినట్టుంది. వర్షను వదిలేస్తున్నా.. నాకు కేతిక అంటే ప్రాణం.. ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అంటూరెచ్చిపోయాడు.
అంతే కాకుండా తన తొడల మీద కేతికను కూర్చోబెట్టుకున్నాడు. ఎమోషనల్ లవ్ డైలాగ్స్ చెప్పాడు. థాంక్స్ భాస్కర్ అని కేతిక అంటుంది. దీంతో ఇమాన్యుయేల్ పరువు మొత్తంగా పోయింది. అందరూ పగల బడి నవ్వుతుంటారు. మరో వైపు వర్ష మాత్రం హీరో వైష్ణవ్ తేజ్‌తో సెటిలైంది.ఈ ఇద్దరూ కలిసి సెల్ఫీలు, లవ్ సింబల్స్ పెట్టుకుంటారు. నాకు మాత్రం వర్ష కావాలి అంటూ వైష్ణవ్ అంటాడు. సర్ ఇది జోక్ అని ఇమాన్యుయేల్ తన వర్షని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి ఇమాన్యుయేల్ వర్ష ఈ ఫన్నీ స్కిట్ బెడిసి కొట్టేసినట్టు కనిపిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.