Ester Noronha : ఆ విషయంలో నన్ను ఎంత టార్చర్ చేసేవాడు .. నోయెల్ పై ఎస్తర్ నొరొన్హా సెన్సేషనల్ కామెంట్స్..!
Ester Noronha : ఇటీవల సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జోడీలు తమ బంధాన్ని కొద్ది రోజులకే కట్ చేసుకోవడం పలు చర్చలకు తావిస్తున్నాయి. ఇక టాలీవుడ్ రాప్ కం సింగర్ అయినా నోయల్ సినీనటి ఎస్తేర్ నొరొన్హా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2019లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఎస్తేర్ నోయెల్ పెళ్లి చాలా ఘనంగా జరిగింది. పలువురు సినిమా ప్రముఖులు కూడా వచ్చి ఆశీర్వదించారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పోస్ట్ వెడ్డింగ్ అంటూ చాలా పార్టీలు కూడా చేసుకున్నారు. అయితే పెళ్లైన మూడు నెలల వ్యవధిలోనే కొన్ని విభేదాల కారణంగా ఈ జంట విడిపోయారు. అయితే విడాకులకు కారణం ఏంటనేది మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ నోయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నానని, అందుకే అతడి నుంచి విడిపోవాలని డిసైడ్ అయిపోయానని ఎస్తర్ ఓపెన్ అయింది. అందుకే అంత త్వరగా విడాకులు తీసుకున్నానని ఎస్తర్ చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత నోయల్ తనపై చెడు ఇంపాక్ట్ పడేలా క్రియేట్ చేశాడని ఎస్తేర్ చెప్పింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనుకున్నా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నోయల్ క్రియేట్ చేసిన చెడు ప్రభావంతో తనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయని ఎస్తర్ చెప్పింది.
అంతా నాదే తప్పు అనుకోని ఒక వ్యక్తి అయితే ఏకంగా హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తామని హెచ్చరించాడని తెలిపింది. దీంతో ఈ విషయాలు జనాల్లో హాట్ ఇష్యూ అయ్యాయని అన్నారు. విడాకులు తీసుకునే సమయంలో కొందరు మేమున్నాము అని ధైర్యం ఇచ్చారని తెలిపింది. విడాకులు తీసుకుని మంచి పనే చేశానని, ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకువచ్చింది. భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయక లాంటి సినిమాల్లో ఎస్తర్ నటించింది. పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా ఎస్తర్ నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఆమెకు గుర్తింపు వచ్చింది..ఆమె తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించారు.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.