Home » Entertainment » Etv Mallemala Sridevi Drama Company Shooting Update
Entertainment

Sridevi Drama Company : ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షూటింగ్ ఒక్క ఎపిసోడ్‌ ఎన్ని రోజులు షూట్‌ చేస్తారో తెలుసా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 6, 2022, 9:30 pm
Advertisement

Sridevi Drama Company : ఈటీవీలో ఈమద్య జబర్దస్త్ కంటే కూడా అధికంగా శ్రీదేవి డ్రామా కంపెనీ సక్సెస్ ను దక్కించుకుంటుంది. జబర్దస్త్‌ గతంలో మాదిరిగా కామెడీ తో అలరించలేక పోతుంది అంటూ విమర్శలు వస్తున్న సమయంలో అదే ఈటీవీ వారు అదే మల్లె మాల వారు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రతి ఆదివారం టెలికాస్ట్‌ అవుతున్న ఈ షో ప్రేక్షకులకు ఫుల్‌ వినోదంను అందిస్తుంది. కన్నుల పండుగ అన్నట్లుగా స్క్రీన్‌ నిండా కమెడియన్స్ మరియు సీనియర్‌ స్టార్స్ కనిపిస్తూ ఉండటంతో ఈ షో కు మంచి రేటింగ్ దక్కుతుంది.

Advertisement

ఎంతో మంది నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు పని చేసే శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క షూటింగ్‌ ఎన్ని రోజులు జరుగుతుంది.. అసలు ఎక్కడ జరుగుతుంది అనేది చాలా మందికి అనుమానం. అసలు విషయం ఏంటీ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్క ఎపిసోడ్‌ కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేస్తారు. ఏవైనా ప్రత్యేక డాన్స్ లు లేదా ఔట్ డోర్ షూట్‌ లు ఉంటే అప్పుడు అదనపు రోజు పట్టే అవకాశం ఉంది. అంత మంది కాల్షీట్లు రెండు మూడు రోజులు అంతకు మించి రోజులు ఒక్క ఎపిసోడ్‌ కు తీసుకుంటే మల్లెమాల మరియు ఈటీవీ వారికి వచ్చే మొత్తం కూడా సరిపోదు.

etv mallemala Sridevi Drama Company shooting update

Advertisement

శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ప్రతి ఎపిసోడ్‌ కూడా ఒక్క రోజులోనే పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తారు. అలా రెండు మూడు రోజుల్లో మూడు నాలుగు ఎపిసోడ్స్ ను లాగించేలా షెడ్యూల్‌ ప్లాన్ చేస్తారు. ఈటీవీ మరియు మల్లెమాల వారు చాలా పక్కాగా ఈ షో ను నిర్వహిస్తూ ఉండటం వల్ల ఎంతో మంది ట్యాలెంట్‌ ఉన్న వారు బయటకు వస్తున్నారు. ఈ షో కేవలం కామెడీ తో మాత్రమే కాకుండా డాన్స్ లతో అలరిస్తుంది.. అలాగే సెంటిమెంట్‌ తో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ విషయం పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి