ETV Show : ఈటీవీ పూర్తిగా షో లపై ఆధారపడి నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీలో వచ్చే సీరియల్స్ ని ఏ ఒక్కరూ చూస్తున్న దాఖలాలు లేవు. ఈటీవీలో ప్రసారం అయ్యే న్యూస్ మరియు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ క్యాష్ ఇంకా పాటల కార్యక్రమం, డాన్స్ కార్యక్రమం తప్ప మరే కార్యక్రమాలకు పెద్దగా ఆదరణ లేదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సాయికుమార్ వావ్ కార్యక్రమంతో ఈటీవీకి నష్టమే తప్ప లాభం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాయికుమార్ తో ఉన్న సుదీర్ఘ కాలపు అనుబంధం కారణంగానే ఈటీవీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలీతో సరదాగా టాక్ షో కి కూడా బాగానే రేటింగ్ వస్తుంది, కానీ వావ్ కార్యక్రమానికి మాత్రం అస్సలు రేటింగ్ రావడం లేదని అసలు ఆ కార్యక్రమాన్ని చూసే వాళ్లే లేకుండా పోయారని సమాచారం అందుతుంది.
మరి కొన్నాళ్ల పాటు ఆ కార్యక్రమాన్ని కొనసాగించే ఉద్దేశంతో ఉన్నారట. ఈటీవీ వారు డబ్బులు రాకున్నా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈటీవీలో సీరియల్స్ కూడా అదే పరిస్థితి. డబ్బులు వచ్చే పరిస్థితి లేకున్నా కూడా ఏదో ఒకటి టైం ఫిల్ చేయాలి అనే ఉద్దేశంతో సీరియల్స్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడ ఉపయోగ దాయకమైన కంటెంట్ మాత్రం కనిపించడం లేదు. కేవలం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మరో రెండు మూడు కార్యక్రమాలతో మాత్రమే ఈటీవీ రేటింగ్ టాప్ లో ఉంటుంది.
సీరియల్స్ మరియు వావ్ కార్యక్రమం విషయంలో ఈటీవీ నిర్వాహకులు దృష్టి పెట్టి ఆ టైమ్ లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించే కంటెంట్ ని తీసుకొస్తే తప్పకుండా ఈటీవీ నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉందంటూ బుల్లి తెర వర్గాల వారు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యాపారంలో నష్టం వస్తుంది అంటే ఏదో సెంటిమెంట్ కి వెళ్లి కంటిన్యూ చేయడం కంటే దాన్ని ఆపేయడం మంచిది. కనుక సాయికుమార్ హోస్టింగ్ చేస్తున్న వావ్ కార్యక్రమాన్ని ఇప్పటికైనా నిలిపివేస్తే బాగుంటుంది అనేది ఈటీవీ ప్రేక్షకుల అభిప్రాయం. మరి ఇంకా ఎంత కాలానికి ఆ కార్యక్రమాన్ని ఆపివేస్తారో చూడాలి. చాలా మందికి ఆ కార్యక్రమం వస్తుంది అనే విషయం కూడా తెలియదు.. అలాంటి కార్యక్రమం టెలికాస్ట్ అవసరమా ఆలోచించండి ఈటీవీ యాజమాన్యం గారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.