Extra Jabardasth Vs Jabardasth : రష్మి జబర్దస్త్ వర్సెస్ సౌమ్య జబర్దస్త్.. దేనికి రేటింగ్ ఎక్కువ రేటింగ్ వస్తుందో తెలుసా?
Extra Jabardasth Vs Jabardasth : తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్ ప్రస్థానం 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. జబర్దస్త్ ప్రారంభం అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ గౌతమ్ యాంకర్స్ గా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల అనసూయ సినిమా ఆఫర్స్ వరుసగా వస్తున్నాయంటూ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసి వెళ్లి పోయింది. దాంతో ఆ సమయంలో జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలను రష్మి గౌతమ్ చూసుకుంది.
కొన్ని వారాల తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి కొత్త యాంకర్ వచ్చింది. కన్నడ బ్యూటీ సౌమ్య రావు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలకు రష్మి గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక రష్మి గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ మరియు సౌమ్య రావు యాంకర్ గా వ్యవహరిస్తున్న జబర్దస్త్ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమానికి ఎక్కువ రేటింగ్ వస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే రష్మి గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి ఎక్కువగా రేటింగ్ వస్తుంది అంటూ బుల్లితెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
Extra Jabardasth And Jabardasth rating
రాంప్రసాద్ టీం ఉండడంతో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ మరియు టీమ్ లీడర్స్ ప్రేక్షకులను నవ్వించే విధంగా కామెడీ స్కిట్స్ చేస్తున్నారు. కానీ జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్న కమెడియన్స్ లో ఏ ఒక్కరు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. ఒక్కరు ఇద్దరు కొత్త టీమ్ మెంబర్స్ వచ్చినా.. కొత్త టీమ్స్ ను తీసుకు వచ్చినా కూడా రేటింగ్ ను పెంచలేక పోతున్నారు. గతంలో హైపర్ ఆది జబర్దస్త్ లో ఉండేవాడు. అప్పుడు జబర్దస్త్ రేటింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్ కంటే ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి ఎక్స్ట్రా జబర్దస్త్ రేటింగు ఎక్కువగా నమోదవుతుంది.
