Home » Entertainment » F3 Director Clarity On The Conflict With Tamannaah
Entertainment

Tamannaah : త‌మ‌న్నాతో గొడ‌వ‌పై ఎఫ్ 3 ద‌ర్శ‌కుడు క్లారిటీ..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 7, 2022, 3:30 pm
Advertisement

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న అంద‌చందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. కేక పెట్టించే అందాల‌తో కంటిపై క‌నుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోను సంద‌డి చేస్తుంది. రీసెంట్‌గా ఎఫ్ 3 చిత్రంతో ప‌ల‌క‌రించింది. క‌రోనా తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్3’ కడుపుబ్బా నవ్విస్తోంది. ఆడియెన్స్ తమ ఫ్యామిలీతో థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. మే27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది ఎఫ్ 3 ప్రమోషన్‌లో మిల్కీబ్యూటీ తమన్నా కనిపించలేదు.

Advertisement

సోషల్‌ మీడియా వేదికగా కూడా ఆమె ఎఫ్‌3 గురించి ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ కాలేదు. పైగా ప్రీ రిలీజ్‌ టైమ్‌లో ఆమె కేన్స్‌ ఉత్సవాల్లో పాల్గొంది. దీంతో చిత్ర ప్రమోషన్‌ లో తమన్నా మార్క్ కనిపించలేదు. అయితే ఇది చూసిన కొందరు దర్శకుడికి, తమన్నాకు మధ్య గొడవ నడిచిందనే వాదన తెరపైకి తెచ్చారు. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా ఈ విషయంపై అనిల్‌ రావిపూడి ఓపెన్ అయ్యారు. ఎఫ్ 3 సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు టైమ్ అయిపోయినా కూడా కాసేపు సెట్‌లోనే ఉండమని ఆర్టిస్టులను కోరాడట అనిల్ రావిపూడి. అయితే అదే సమయంలో తాను వర్కవుట్స్ చేసుకోవాలని, వెళ్లిపోవాలని తమన్నా చెప్పిందట.

F3 director Clarity on the conflict with Tamannaah

Advertisement

Tamannaah : త‌మ‌న్నా ఇష్యూ..

దీని వల్ల రెండ్రోజులు వారిద్దరి మధ్య సరిగ్గా మాటలు లేకపోవడం నిజమే కానీ అది పెద్ద గొడవేమీ కాదు అంటూ అనిల్ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ విషయం మెల్లగా సర్దుబాటు అయిపోయిందని కూడా అన్నాడు. ప్రస్తుతం థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ F3 మూవీలో రే చీకటితో బాధపడే వ్యక్తిగా వెంకటేష్, నత్తితో బాధపడే వ్యక్తిగా వరుణ్ తేజ్ నటించి కడుపుబ్బా నవ్వించారు. వెంకటేష్‌కు జోడీగా తమన్నా నటించగా.. వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ ఆడిపాడింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి