F3 Movie Dil Raju Plan How will workout last
F3 Movie : టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజుకు మంచి పేరుంది. ఎంత పెద్ద హీరో నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి వస్తున్నా శర్వానంద్ లాంటి మీడియం రేంజ్ హీరోతో సినిమా తీసీ బాక్సాఫీస్ వద్ద పోటీగా దింపే సత్తా ఉంది. బిజినెస్ ట్రిక్స్ బాగా తెలిసిన
నిర్మాత అని దిల్ రాజును అందరూ అంటుంటారు. సినిమాను ప్రమోట్ చేయడంలో..బజ్ క్రియేట్ చేసి జనాలను థియేటర్స్‌కు రప్పించడంలో దిల్ రాజు స్ట్రాటజీనే వేరు. ఇప్పుడు అలాంటి స్ట్రాటజీనే ఎఫ్ 3 సినిమాకి అప్లయ్ చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’ అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మే 27న థియేటర్లలోకి భారీ స్థాయిలో వస్తోంది. అయితే, కరోనా కారణంగా ఇటీవల కాలంలో అధిక టికెట్ రేట్లతో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల అన్నీ వర్గాల ఆడియన్స్ థియేటర్ల వరకు రావడం లేదు. అందుకే, ఇప్పుడు ఎఫ్ 3ని సాధారణ టికెట్ ధరలతో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
F3 Movie Dil Raju Plan How will workout last
పెంచేసిన రేట్లతో ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకొస్తే డబ్బులు మంచి నీళ్ళలా ఖర్చవడం ఖ్యామని భావించిన వారు..చక్కగా ఓటీటీల సబ్ స్క్రిప్షన్స్ తీసుకొని అందరూ కలిసి ఇంట్లోనే కావాల్సినన్ని సినిమాలు చూడొచ్చని డిసైడ్ అయ్యారు. అందుకే, ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్
ఉండటం లేదు. ఇదే దిల్ రాజు ఆలోచించాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను గట్టిగా టార్గెట్ చేసి ఎఫ్ 3 సినిమాను సాధారణ టికెట్ ధరలతో తీస్కువస్తున్నారు. మరి దిల్ రాజు ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా, పూజా హెగ్డే
స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనున్నారు.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
This website uses cookies.