
false news on sundaram master death
Sundaram Master : బ్రతికి ఉన్న వాళ్లను చంపేయడం కొత్తేమి కాదు. పూర్తి వివరాలు తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. తాజాగా తెలుగు నాటక రంగానికి హాస్యంతో కొత్త శైలి చూపిన రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జల సుందరం మాస్టారు (71) కన్నుమూశారు. చిక్కడపల్లిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందంటూ సుందరం మాస్టారు తన మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్ చేశారు. అయితే ఆయన శిష్యులు వెంటనే ముషీరాబాద్ కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుందరం మాస్టారు మరణవార్త విన్న పలువురు రంగస్థల ప్రముఖులు నివాళులర్పించారు.
నవలా రచయిత సుందరం మాస్టారు మరణ వార్త విన్న తర్వాత మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఒక టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అయినటువంటి సుందరం మాస్టర్ ఇక లేరు అనే వార్త సినీ వర్గాలను విష్మయానికి లోను చేసింది. చాలా మంది ఆయన పైనే పలు పోస్టులు కూడా పెట్టేసారు. కానీ సినీ వర్గాల నుంచి లేటెస్ట్ క్లారిటీ ప్రకారం అయ్యితే అస్సలు ఈ స్ప్రెడ్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదట. సుందరం మాస్టర్ బాగానే ఉన్నారని ఆరోగ్యంగానే ఉన్నారని సినీ వర్గాల నుంచి లేటెస్ట్ సమాచారం. దీనితో ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యొద్దు అని అందరు మనవి చేసుకుంటున్నారు.
false news on sundaram master death
సుందరం మాస్టారు కన్నుమూయడంతో పలువురు రంగస్థల ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. అమెరికా నుంచి ఆయన కుమారుడు, కుమార్తె రావాల్సి ఉండగా.. ఆ తరువాత ఈనెల 23న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సుందరం మాస్టారు అంత్యక్రియలు జరగనున్నాయి. 1950 అక్టోబరు 29న ఒంగోలులో జన్మించారు సుందరం మాస్టారు. బీఎస్సీ చదివిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగ స్థల కళల విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య శిరీష మరణించారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.