
fans unhappy with tollywood star heroine kajal agarwal re entry
Kajal Agarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ దాదాపు పుష్కర కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. మొన్నటి వరకు కూడా కాజల్ నటిస్తే ఓకే అన్నట్లుగా చాలా మంది దర్శకులు మరియు నిర్మాతలు ఆమె వెంట పడ్డారు. 2020 సంవత్సరంలో ఆమె గౌతమ్ ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఆమె కు వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ వెంటనే గర్భవతి అవ్వడం తో సినిమాలకు ఎక్కువగా కమిట్ అవ్వలేదు. కొన్ని నెలల క్రితమే కాజల్ అగర్వాల్ తన కొడుకుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొడుకుతో మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్ త్వరలోనే కెమెరా ముందుకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా పుకార్ల షికార్లు చేస్తున్నాయి.
కొడుకు కి కనీసం ఏడాది వయసు కూడా పూర్తి కాకుండానే అప్పుడే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడం ను కొందరు తప్పు పడుతున్నారు. కాజల్ మేడం.. మరి ఇంత త్వరగా సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమేముంది, మరి అంతగా ఆగలేక పోతున్నారా? ఇంత తొందర అవసరం లేదండి. దయ చేసి మీ బాబు విషయంలో శ్రద్ధ చూపండి. అతడికి ఈ సమయంలో మీ యొక్క అవసరం చాలా ఉంటుంది. కనుక సినిమాల్లో బిజీ అయ్యి కొడుహీరోయిన్కు యొక్క అవసరాలను పట్టించుకోవడం మానేయకండి. దయచేసి మీరు మరి కొన్నాళ్ల పాటు పూర్తిగా కొడుకుకి కేటాయించండి. ఆ తర్వాత మళ్లీ మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని మేము కోరుకుంటున్నాం.
fans unhappy with tollywood star heroine kajal agarwal re entry
మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం.. కానీ మరీ ఇంత త్వరగా మీరు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవి ఇస్తామంటే మాత్రం మేము ఒప్పుకోము.. అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కాజల్ అగర్వాల్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ మధ్య కాజల్ అగర్వాల్ మధ్యలో వదిలేసిన నాగార్జున సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పకనే చెబుతున్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు.. కానీ కొందరు అభిమానులు మాత్రం ఆమెను మరి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని కొడుకుకి మాతృత్వాన్ని పంచాలని సూచిస్తున్నారు. ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కాలమే నిర్ణయించాలి.
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
This website uses cookies.