Janhvi kapoor : దొరికింది కదా అని కక్కుర్తి పడితే అంతే మరి.. జాన్వీ కపూర్ ఆసుపత్రిలో చేరడంతో నెటిజన్స్ ట్రోల్స్..!
Janhvi kapoor : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నిత్యం ఏదో రకంగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో రచ్చ చేస్తుంటుంది. ఇటీవల జాన్వీ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం మే నెలలో రిలీజ్ అయింది. జాన్వీ మెయిన్ రోల్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ఉల్జా ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక జాన్వీ.. దేవర చిత్రంతో తెలుగులోనూ జాన్వీ అడుగుపెడుతున్నారు. రామ్‍చరణ్‍తోనూ ఓ సినిమా చేయనున్నారు.
అయితే ఇటీవలే అనంత్ అంబానీ – రాధిక మర్చెంట్ వివాహంలో జాన్వీ కపూర్ సందడి చేశారు. అయితే ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ముంబయ్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతోంది. అయితే అమె తీసుకున్న ఆహారం కల్తీ అవడంతో అనారోగ్యానికి గురైందని ప్రస్తుతం జాన్వీ ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు సన్నిహితులు, తండ్రి బోనీ కపూర్ తెలిపారు.. గత వారం అంబానీ ఇంట పెళ్లికి జాన్వీ హాజరైన విషయం తెలిసిందే.ఆ వేడుకలో ఆమె ఫుల్ చిందేసింది.ఇక పుడ్ కూడా ఫుల్ కుమ్మేసి ఉంటుందని, అందుకే ఆమెకి ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుందని అంటున్నారు.
Janhvi kapoor : దొరికింది కదా అని కక్కుర్తి పడితే అంతే మరి.. జాన్వీ కపూర్ ఆసుపత్రిలో చేరడంతో నెటిజన్స్ ట్రోల్స్..!
కల్తీ ఆహారం వల్ల కడుపులో ఆమెకు ఇబ్బంది ఏర్పడిందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ రేపు (జూలై 19) ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కానున్నారట.ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో లంగావోణిలో పల్లెటూరి అమ్మాయిగా జాన్వీ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఆమె లుక్ ఆకట్టుకుంది. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. దేవర చిత్రంలో తన పాత్ర చాలా బాగుంటుందని గతంలో జాన్వీ ఓసారి చెప్పారు. ఉల్జా సినిమా ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ మెయిన్ రోల్ చేశారు. డిప్యూటీ హైకమిషనర్ సుహానా భాటియా క్యారెక్టర్‌లో నటించారు.
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
This website uses cookies.