The Paradise Movie Advance Bookings : ఇది కదా ర్యాంపేజ్.. ఇండియా నుంచి అమెరికా వరకు నాని జోరు.. బుకింగ్స్ లెక్కలు ఇవే!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on: September 23, 2026, 7:33 pm
  •  The Paradise Movie Advance Bookings : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ పై మొదటి నుంచే భారీ అంచనాలు…

The Paradise Movie Advance Bookings : నేచురల్ స్టార్ నాని Nani , దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఆ హైప్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ ద్వారా సినిమా ఇప్పటికే రూ.44 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది.

The Paradise Movie Advance Bookings : ఇది కదా ర్యాంపేజ్.. ఇండియా నుంచి అమెరికా వరకు నాని జోరు.. బుకింగ్స్ లెక్కలు ఇవే!

The Paradise Movie Advance Bookings : ఇది కదా ర్యాంపేజ్.. ఇండియా నుంచి అమెరికా వరకు నాని జోరు.. బుకింగ్స్ లెక్కలు ఇవే!

The Paradise Movie Advance Bookings ప్రపంచవ్యాప్తంగా రూ.44.09 కోట్లు.. హైదరాబాద్‌లో బుకింగ్స్ జోరు

సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన లెక్కల ప్రకారం ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా రూ.44.09 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ సేల్స్ నమోదు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో ఇండియా నుంచి రూ.29.17 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ.14.92 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. రిలీజ్‌కు ముందే ఈ స్థాయి వసూళ్లు నమోదు కావడంతో ఇప్పుడు సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్‌పై అందరి దృష్టి పడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ దూకుడుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి రూ.22.69 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. తెలంగాణ నుంచి రూ.14.05 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.8.64 కోట్లు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోనే రూ.11.40 కోట్ల అడ్వాన్స్ సేల్స్ రావడం విశేషం.ఓవర్సీస్‌లో అమెరికా మార్కెట్ ముందంజలో ఉంది. అక్కడ 1.16 మిలియన్ డాలర్ల అడ్వాన్స్ సేల్స్ నమోదైనట్లు సమాచారం. యూకేలో 1,57,200 డాలర్లు, కెనడాలో 1,04,000 డాలర్లు, ఆస్ట్రేలియాలో 69,500 డాలర్ల వరకు బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ లెక్కలు సూచిస్తున్నాయి.అడ్వాన్స్ బుకింగ్స్ ప్రధాన లెక్కలు చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.44.09 కోట్లు, ఇండియా రూ.29.17 కోట్లు, ఓవర్సీస్ రూ.14.92 కోట్లు, ఏపీ + తెలంగాణ రూ.22.69 కోట్లు, తెలంగాణ రూ.14.05 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.8.64 కోట్లు, హైదరాబాద్ రూ.11.40 కోట్లు నమోదైనట్లు సమాచారం.

Also Read : The Paradise Movie First Review : ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ లైవ్ అప్ డేట్స్‌..!

1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో జడల్ పోరాటం

‘ది ప్యారడైజ్’ కథ 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సమాజంలో సరైన గుర్తింపు లేకుండా, వివక్షకు గురయ్యే ఒక సంచార తెగకు చెందిన వ్యక్తి తన ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. నాని ఈ సినిమాలో ధగడ్ అలియాస్ జడల్ పాత్రలో కనిపించనున్నారని కథనాల్లో పేర్కొంటున్నారు. ఈ పాత్ర కోసం నాని పూర్తిగా కొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నారు. డార్క్ అండ్ రఫ్ లుక్‌తో ఆయన పాత్రను డిజైన్ చేశారు.మోహన్ బాబు, రాఘవ్ జుయాల్ ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రలో కనిపించనున్నారు. సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి ఇతర కీలక పాత్రలు పోషించారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, వైలెన్స్ కారణంగా సినిమాకు ‘A’ సర్టిఫికెట్ వచ్చినట్లు సమాచారం. ముందస్తు రిపోర్టుల ప్రకారం సినిమా రన్‌టైమ్ 2 గంటల 49 నిమిషాలుగా ఉంది.ఇప్పటికే రూ.44 కోట్ల మార్క్‌ను దాటిన అడ్వాన్స్ బుకింగ్స్, విడుదలకు ముందే రూ.50 కోట్ల క్లబ్‌ను చేరుతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నుంచి అమెరికా వరకు బుకింగ్స్‌కు వస్తున్న స్పందనతో ‘ది ప్యారడైజ్’ మాస్ ర్యాంపేజ్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

No liveblog updates yet.

LIVE UPDATES

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp