Sarkaru vari pata : సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా. అంతేకాదు మహేష్ బాబు కెరిర్ లో 27 వ సినిమాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సాధించిన పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తో 14 రీల్స్ ప్లస్ .. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
for-sarkaru-vari-pata-romantic-song-keerthy-suresh-and-mahesh-babu-is-ready
కాగా గత నెలలో సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు పరశురాం ఈ సినిమాని నాన్ స్టాప్ గా తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే భారీ యాక్షన్స్ సీన్స్ ని .. ఛేజింగ్ సీన్స్ ని తెరకెక్కించాడు పరశురాం. ఫస్ట్ షెడ్యూల్ లో 30 శాతం షూటింగ్ తో పాటు ఒక సాంగ్ ని కంప్లీట్ చేస్తారని ముందు నుంచి చెబుతున్నారు. అలాగే ఇప్పుడు పరశురాం సాంగ్ కి రెడి అవుతున్నాడని సమాచారం. కాగా సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు కీర్తి సురేష్ దుబాయ్ చేరుకుంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ వెల్లడిస్తూ దుబాయ్ ఏయిర్ పోర్ట్ లో దిగిన ఫోటో ని షేర్ చేసింది.
Sarkaru vari pata : మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించబోతున్నారు.
కాగా మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించబోతున్నారు. మహేష్ బాబు లవర్ బాయ్ గా కూడా కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా కథా నేపథ్యం యూనివర్సల్ గా ఉండేలా ఎంచుకున్నాడు పరశురాం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ని హాలీవుడ్ హీరో తరహాలో చూపించబోతున్నాడు. బ్యాకింగ్ రంగంలో ఆర్ధికంగా కుంభకోణం నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఈ బ్యాక్ డ్రాప్ ని అద్భుతంగా తెర మీద చూపించబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇక దుబాయ్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో నెలరోజుల పాటు భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత అమెరికా షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.