Sarkaru vari pata : సర్కారు వారి పాట లో రొమాంటిక్ సాంగ్ కి మహేష్ – కీర్తి రెడీ ..!

Authored By vamana sai | The Telugu News | Published on: February 16, 2021, 7:00 am

Sarkaru vari pata : సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా. అంతేకాదు మహేష్ బాబు కెరిర్ లో 27 వ సినిమాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సాధించిన పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తో 14 రీల్స్ ప్లస్ .. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

for-sarkaru-vari-pata-romantic-song-keerthy-suresh-and-mahesh-babu-is-ready

for-sarkaru-vari-pata-romantic-song-keerthy-suresh-and-mahesh-babu-is-ready

కాగా గత నెలలో సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు పరశురాం ఈ సినిమాని నాన్ స్టాప్ గా తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే భారీ యాక్షన్స్ సీన్స్ ని .. ఛేజింగ్ సీన్స్ ని తెరకెక్కించాడు పరశురాం. ఫస్ట్ షెడ్యూల్ లో 30 శాతం షూటింగ్ తో పాటు ఒక సాంగ్ ని కంప్లీట్ చేస్తారని ముందు నుంచి చెబుతున్నారు. అలాగే ఇప్పుడు పరశురాం సాంగ్ కి రెడి అవుతున్నాడని సమాచారం. కాగా సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు కీర్తి సురేష్ దుబాయ్ చేరుకుంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ వెల్లడిస్తూ దుబాయ్ ఏయిర్ పోర్ట్ లో దిగిన ఫోటో ని షేర్ చేసింది.

Sarkaru vari pata : మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించబోతున్నారు.

కాగా మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించబోతున్నారు. మహేష్ బాబు లవర్ బాయ్ గా కూడా కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా కథా నేపథ్యం యూనివర్సల్ గా ఉండేలా ఎంచుకున్నాడు పరశురాం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ని హాలీవుడ్ హీరో తరహాలో చూపించబోతున్నాడు. బ్యాకింగ్ రంగంలో ఆర్ధికంగా కుంభకోణం నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఈ బ్యాక్ డ్రాప్ ని అద్భుతంగా తెర మీద చూపించబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇక దుబాయ్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో నెలరోజుల పాటు భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత అమెరికా షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp