Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్‌పై మెగా అభిమానులు తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అదే సమయంలో నాగ బాబు ట్వీట్ చేయడం.. ఆ తర్వాత ట్విట్టర్ ను డీయాక్టివేట్ చేసి యాక్టివేట్ చేయడం.. పవన్ గెలిచాక మెగా సెలబ్రేషన్స్ కు కూడా రాకపోవడం.. ఇవన్నీ తెలిసిందే. మెగా ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారని చెప్పుకోవడానికి లేదు.
పవన్ గెలిచిన తర్వాత మెగా కాంపౌండ్‌లో బన్నీ కానీ , అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించలేదు. నాగబాబు, సాయిథరమ్ తేజ్‌లు అల్లు అర్జున్‌పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు. అయితే పెద్దలు కల్పించుకుని గొడవను చక్కదిద్దినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపించాయి. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప – 2 వాయిదా పడటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇటీవల మెగా, అల్లు కుటుంబాలకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు సైతం ఈ విభేదాలను ధృవీకరించేలా మొన్నామధ్య ప్రెస్‌మీట్‌లో మాట్లాడటాన్ని తేలికగా తీసుకోవడానికి లేదు. ఈ వరుస సంఘటనలతో అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారు.
తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ మూవీ గబ్బర్ సింగ్‌లో అంత్యక్షరి గ్యాంగ్‌లో ఒకడైన సాయిబాబా అనే నటుడైతే ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వచ్చినా చేయనని కరాఖండీగా తేల్చిచెప్పేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బన్నీ బిహేవియర్ తనకు నచ్చదని, సెల్ఫీ, ఆటోగ్రాఫ్ కోసం వచ్చే అభిమానులను ఆయన తన్నడాన్ని చూశానని సాయిబాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనను తిట్టినా పర్లేదని.. పుష్ప-2 డేట్ ఇంకా ఛేంజ్ చేసుకుంటూ ఉండాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసునని.. కొంతమంది ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సాయిబాబాపై బన్నీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.