Home » Entertainment » Gajuwaka Lady Conductor Super Expressive Dance Hyper Aadi In Sridevi Drama Company
Entertainment

Hyper Aadi : గాజువాక లేడీ కండక్టర్.. చూపుల్తోనే రెచ్చగొట్టేసింది.. ఊగిపోయిన ఆది, రాం ప్రసాద్

Authored By
aruna
The Telugu News | Published on: August 24, 2022, 2:20 pm
Advertisement

Hyper Aadi : టాలెంట్ ఎవరి సొంతం కాదు.. ఏ వయసులో ఉన్నా కూడా మన ప్రతిభను చాటుకోవచ్చు. ఏ రంగంలో ఉన్నా కూడా మన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయోచ్చు. ఇప్పుడు అందరికీ అన్ని రకాల వేదికలు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో తమ తమ టాలెంట్లను నిరూపించుకొచ్చు. మన దగ్గర టాలెంట్ ఉంటే.. అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఇలా టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు ఇవ్వడంలో మాత్రం బుల్లితెరపై మల్లెమాల మాత్రమే ముందుంటుంది. ఎంతో మందిని తెర మీదకు తీసుకొచ్చింది. మల్లెమాల ఎప్పుడూ కూడా కొత్తగా ఆలోచిస్తుంటుంది.

Advertisement

కొత్తగా ట్రై చేస్తుంది. ఇప్పుడు కూడా అందరినీ ఆశ్చర్యపరిచేసింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్ పెట్టేసింది. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్లోని డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి జనాలు కిందామీదా అవుతున్నారు. గాజువాక లేడీ కండక్టర్ అని తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది. ఇక ఆమె పేరు అదే అని అంతా ఫిక్స్ అయ్యారు. గాజువాక కండక్టర్ అని పిలుస్తున్నారు. ఆమె వేసిన స్టెప్పులు, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూస్తే జనాలకు పిచ్చెక్కిపోవడం ఖాయం. ఆమె చూపులు, స్టెప్పులు చూసిన జనాలకు కునుకు ఉండటం లేదు. ఇక యూట్యూబ్ కింద మొత్తం ఆమె గురించే కామెంట్లు కనిపిస్తున్నాయి. గాజువాక కండక్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీ ని ఒక ఊపు ఊపేసింది.

gajuwaka lady conductor super expressive dance Hyper Aadi in Sridevi Drama Company

Advertisement

మీకు కృతజ్ఞతలు మేడం, శ్రీదేవి డ్రామా కంపెనీ సక్సెస్ అవ్వడానికి కారణం టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాರು.. దానికి సాక్షిగా ఈ prom చాలూ.., లేడీ కండక్టర్ అ మజాకా.. అంటూ ఇలా కామెంట్లతో పొగిడేస్తున్నారు. మొత్తానికి లేడీ కండక్టర్ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. టాలెంట్ ఏవరి సొంతం కాదు… ఇంకో కొత్త టాలెంట్ పర్సన్‌ను తీసుకొచ్చింది శ్రీ దేవి డ్రామా కంపెనీ, గాజువాక డిపో కండక్టర్ ఎనర్జీ సూపరో సూపర్.. మనస్ఫూర్తిగా చెబుతున్నాం చాలా, చాలా బాగుంది, గాజువాక కండక్టర్ డాన్స్ హైలైట్ అంటూ కామెంట్లతో దుమ్ములేపుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి