Gangavva : గంగవ్వ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యూట్యూబ్ చానల్ ద్వారా తెలుగు వారికి చేరువై.. చివరకు బిగ్‌బాస్ షోలో పాల్గొని.. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితురాలు అయ్యింది. ఆమెతో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నారంటే గంగవ్వ క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల సద్గురు.. ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన సమయంలో గంగవ్వను కలిశారు. ఈ సందర్భంగా సద్గురుతో “65 ఏళ్ల వయసున్న మీరు వర్షం, మంచు, ఇసుక తుఫానుల గుండా ప్రయాణిస్తున్నారంటే.. ఎవరో దేవుడు మీ వెనకే ఉన్నాడు, లేకపోతే ఇదంతా జరగదు” అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది.
యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ మై విలేజ్ షో అనే ఒక ఛానల్ ద్వారా పేరు తెచ్చుకుంది. అలా యూట్యూబ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న గంగవ్వ బిగ్ బాస్ షో కి కూడా వెళ్లి తాను ఉండగలిగినన్నాళ్లు ఉండి ప్రేక్షకులను అలరించింది. అయితే నిత్యం ప్రకృతిలో సేదతీరే గంగవ్వ లాంటి వారు ఈ ఏసీ గదులలో మధ్య ఎన్ని రోజులు ఉండగలరు చెప్పండి. అందుకే అనారోగ్య కారణాలతో ఆమె బయటకు వచ్చేసింది. హోస్ట్ నాగార్జున ఆమెకు కొత్త ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చారు. గంగవ్వ ఏడాది క్రితం నూతన గృహప్రవేశం చేశారు.
ప్రస్తుతం గంగవ్వ కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఐతే ఆమెకు షూటింగ్స్ లో క్యారవాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. క్యారవాన్ అనుభవం తెలియజేశారు. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక గంగవ్వకు క్యారవాన్ ఇవ్వడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఓ మోస్తరు నటులకు కూడా క్యారవాన్ సౌకర్యం ఇవ్వరు. అలాంటిది నిర్మాతలు గంగవ్వకు క్యారవాన్ ఇవ్వడం ప్రత్యేకంగా మారింది. గవ్వ నెట్ ఫ్లిక్స్ కోసం రానా, సాయి పల్లవిలను ఇంటర్వ్యూ చేసింది. ఇక అప్పుడే ఆమెకు ఈ క్యారవాన్ ఎలాట్ చేశారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.