Gangavva : గంగ‌వ్వ కోసం స్పెష‌ల్ కార్‌వ్యానా.. ఏంది ఆ క్రేజ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gangavva : గంగ‌వ్వ కోసం స్పెష‌ల్ కార్‌వ్యానా.. ఏంది ఆ క్రేజ్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 July 2022,1:30 pm

Gangavva : గంగ‌వ్వ‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యూట్యూబ్ చానల్ ద్వారా తెలుగు వారికి చేరువై.. చివరకు బిగ్‌బాస్ షోలో పాల్గొని.. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితురాలు అయ్యింది. ఆమెతో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంట‌ర్వ్యూలు చేయించుకుంటున్నారంటే గంగవ్వ క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల‌ సద్గురు.. ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన సమయంలో గంగవ్వను కలిశారు. ఈ సందర్భంగా సద్గురుతో “65 ఏళ్ల వయసున్న మీరు వర్షం, మంచు, ఇసుక తుఫానుల గుండా ప్రయాణిస్తున్నారంటే.. ఎవరో దేవుడు మీ వెనకే ఉన్నాడు, లేకపోతే ఇదంతా జరగదు” అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది.

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ మై విలేజ్ షో అనే ఒక ఛానల్ ద్వారా పేరు తెచ్చుకుంది. అలా యూట్యూబ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న గంగవ్వ బిగ్ బాస్ షో కి కూడా వెళ్లి తాను ఉండగలిగినన్నాళ్లు ఉండి ప్రేక్షకులను అలరించింది. అయితే నిత్యం ప్రకృతిలో సేదతీరే గంగవ్వ లాంటి వారు ఈ ఏసీ గదులలో మధ్య ఎన్ని రోజులు ఉండగలరు చెప్పండి. అందుకే అనారోగ్య కారణాలతో ఆమె బయటకు వచ్చేసింది. హోస్ట్ నాగార్జున ఆమెకు కొత్త ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చారు. గంగవ్వ ఏడాది క్రితం నూతన గృహప్రవేశం చేశారు.

gangavva caravan tour in virata parvam promotion

gangavva caravan tour in virata parvam promotion

Gangavva : గంగ‌వ్వ హ‌వా..

ప్ర‌స్తుతం గంగ‌వ్వ కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఐతే ఆమెకు షూటింగ్స్ లో క్యారవాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. క్యారవాన్ అనుభవం తెలియజేశారు. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక గంగవ్వకు క్యారవాన్ ఇవ్వడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఓ మోస్తరు నటులకు కూడా క్యారవాన్ సౌకర్యం ఇవ్వరు. అలాంటిది నిర్మాతలు గంగవ్వకు క్యారవాన్ ఇవ్వడం ప్రత్యేకంగా మారింది. గవ్వ నెట్ ఫ్లిక్స్ కోసం రానా, సాయి పల్లవిలను ఇంటర్వ్యూ చేసింది. ఇక అప్పుడే ఆమెకు ఈ క్యారవాన్ ఎలాట్ చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది