
Bigg Boss 8 Telugu : గంగవ్వని మధ్యలోనే బయటకి పంపబోతున్నారా.. అసలు కారణం ఏంటి ?
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం రోజు రోజుకి పలు ట్విస్ట్‌లతో సాగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకులకి అంతగా అర్ధం కావడం లేదు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో మరింత కామెడీ, గొడవలు, ఫైట్స్ జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక నామినేషన్స్ రచ్చతో బిగ్ బాస్ హౌజ్ హీటెక్కిపోతుంది. మరోవైపు ప్రతి వారం కూడా హౌజ్ నుండి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు.ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అందరు ఆసక్తిగా గమనిస్తుండగా,ఆసక్తికర విషయం బయటకి వచ్చింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఈవారం మధ్యలోనే ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడనుందని సమాచారం. బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నిఖిల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నైనిక పావని, మెహబూబ్ నామినేట్ కాగా, వీరు కాకుండా మధ్యలో గంగవ్వ వాలంటీర్‌గా ఎగ్జిట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. గంగవ్వపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ గంగవ్వతోపాటు యూట్యూబర్ రాజుపై జగిత్యాల అటవీశాఖ అధికారులకు జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. దీంతో గంగవ్వ ఈ సారి కూడా మధ్యలోనే హౌజ్ నుండి వెళ్లనుందని టాక్.
Bigg Boss 8 Telugu : గంగవ్వని మధ్యలోనే బయటకి పంపబోతున్నారా.. అసలు కారణం ఏంటి ?
గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్‌తో చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ ఛానెల్‌లో పలు వీడియోలు చేస్తూ అలరించింది. రెండేళ్ల క్రితం ఓ వీడియోలో భాగంగా జ్యోతిష్యం కోసం చిలుకను ఉపయోగించారు యూట్యూబర్ రాజు, గంగవ్వ. 2022, మే 20న గంగవ్వ చిలుక పంచాగం అనే వీడియోను అప్‌లోడ్ చేశారు. సొంత ప్రయోజనాల కోసం మూగ జీవాలను హింసించి, వన్య ప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘించారని గౌతమ్ ఫిర్యాదు చేశారు. వినోదం కోసం చిలుకను వాడుకోవడం చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందన్న గౌతమ్ ఆరోపించారు. దాంతో ఇప్పటికే యూట్యూబర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి, గంగవ్వను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందని టాక్ నడుస్తోంది. ఒకవేళ గంగవ్వను అరెస్ట్ చేయాల్సి వస్తే ఈ వారం గంగవ్వ వాలంటీర్‌గా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని పలువురు రివ్యూవర్లు చెబుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ కూడా రెండు రోజుల ముందుగానే ప్లాన్ చేయనున్నారని సమాచారం.
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
This website uses cookies.