Home » Entertainment » Gautam Revenge Yashmi Faces The Consequences In Bigg Boss 8 Telugu
Entertainment

Bigg Boss 8 Telugu : న‌మ్మినోడికే వెన్నుపోటు పొడిచిన విష్ణు ప్రియ‌… నామినేష‌న్స్‌లో ఉందెవ‌రంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: October 29, 2024, 2:00 pm
Advertisement

Bigg Boss 8 Telugu : సోమ‌వారం వ‌చ్చిందంటే బిగ్ బాస్ హౌజ్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ ఓ రేంజ్ లో సాగుతుంది. ఒకరిపై ఒక‌రు ప‌లు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ ర‌చ్చ చేస్తుంటారు. అయితే బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్‌ ఎన్నడు జరగని విధంగా జరిగింది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్ అంతా మెగా చీఫ్ విష్ణుప్రియ చేతిలో పెట్టాడు బిగ్ బాస్.అంతేకాదు మెగా చీఫ్ అయిన విష్ణుప్రియకు సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం ఏకంగా ఐదుగురుని నామినేట్ చేసే అవకాశాన్ని విష్ణుప్రియకు ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో ఆమె ముందుగా ఐదుగురుని నామినేట్ చేసింది. వారిలో తను మెగా చీఫ్ కావడానికి కారణమైన గౌతమ్, నబీల్‌ ఇద్దరికి వెన్నుపోటు పొడిచింది.

Advertisement

Bigg Boss 8 Telugu నామినేష‌న్స్‌లో ఎవ‌రంటే..

ఇక గౌతమ్ ఫీలింగ్స్ తో ఆడుకోవడం.. అన్ని బకరాను చేసే ప్రయత్నం చేయడంతో యష్మిని గట్టిగా టార్గెట్ చేశాడు గౌతమ్. ఐలవ్ వూ అన్న నోటితోనే అక్కా అంటూ నరకం చూపంచాడు. అంతే కాదు ఈసారి యష్మీ చేసిన తప్పులు ను బయటపెట్టడంలో నాగార్జున వైపు నుంచి కూడా హెల్ప్ గట్టిగానే జరిగినట్టుంది. ఈ వీకెండ్ రెండు రోజులు యష్మీ -నిఖిల్ బండారం బయట పెట్టే అన్ని క్లిప్పింగ్స్ ను బిగ్ బాస్ ప్లే చేశారు. నామినేష‌న్స్ లో ముందుగా నామినేషన్స్‌లో ముందుగా గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది విష్ణుప్రియ. గౌతమ్‌ను నామినేట్ చేసి జైలులో వేసింది విష్ణుప్రియ. అనంతరం ప్రేరణ, నయని పావని, టేస్టీ తేజ, నబీల్‌ను నామినేట్ చేసి జైలులో వేసింది విష్ణుప్రియ. దానికి పుల్ ఫైర్ అయిన నబీల్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ప్రతిదాంట్లో నా పార్టిస్‌పేషన్ ఉంది, నువ్ పృథ్వీతోనే ఉంటే నేను ఎక్కడ కనిపిస్తాను అని విష్ణుకు ఇచ్చిపడేశాడు నబీల్.

Bigg Boss 8 Telugu : న‌మ్మినోడికే వెన్నుపోటు పొడిచిన విష్ణు ప్రియ‌… నామినేష‌న్స్‌లో ఉందెవ‌రంటే..!

Advertisement

రాయల్ క్లాన్ నుంచి చివరిలో కత్తి అందుకున్న గౌతమ్ ఓజీ క్లాన్‌లోని నిఖిల్‌కు మిరపకాయ దండ వేసి విష్ణుప్రియను సేవ్ చేసి మెగా చీఫ్ అవడానికి ఒక కారణం అయ్యాడు. అలాంటి గౌతమ్‌ను అందరికంటే ముందే నామినేట్ చేసి మరి విష్ణుప్రియ వెన్నుపోటు పొడిచినట్లు అయింది. మధ్యలో జైలు కీస్ పెట్టి అది అందుకున్న వాళ్లు ఒకరి నామినేట్ నుంచి తప్పించి వారికి బదులు మరొకరిని నామినేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే, అందులో ఒకసారి కీస్ తీసుకున్నవాళ్లు మరోసారి తీసుకోకూడదని, ఆటలో విష్ణు పాల్గొనకూడదని అన్నారు. ఈ ఆటలో కీస్ అందుకున్న పృథ్వీ.. నబీల్‌ను సేవ్ చేసి అవినాష్‌ను నామినేట్ చేశాడు. తర్వాత యష్మీ.. ప్రేరణను కాపాడి, హరితేజను నామినేట్ చేసింది. తర్వాత కీస్ అందుకున్న రోహిణి.. అవినాష్‌ను సేవ్ చేసి పృథ్వీని జైలులో పెట్టింది. అనంతరం టేస్టీ తేజను కాపాడిన అవినాష్ యష్మీని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ పృథ్వీని కాపాడి మళ్లీ టేస్టీ తేజను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది గౌతమ్ కృష్ణ, నయని పావని, హరితేజ, యష్మీ గౌడ, టేస్టీ తేజ.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి