Home » Entertainment » Gautham And Shivaji Arguments In Bigg Boss Telugu 7
Entertainment

Bigg Boss Telugu 7 : నువ్వెంత.. నీ బతుకెంత.. నామినేషన్స్‌లో శివాజీపై రెచ్చిపోయిన గౌతమ్.. మంచి పని చేశావని మెచ్చుకున్న అమర్‌దీప్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 26, 2023, 2:00 pm
Advertisement

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం నామినేషన్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రిన్స్ యావర్.. ప్రియాంకను నామినేట్ చేయగా.. శుభశ్రీ రతికను నామినేట్ చేస్తుంది. గౌతమ్ వంతు వచ్చేసరికి.. ప్రిన్స్ యావర్, తేజ ఇద్దరినీ నామినేట్ చేస్తాడు. కానీ.. తేజ కారణాలు సరిగ్గా లేవని జ్యూరీ సభ్యులు తేజను పరిగణనలోకి తీసుకోరు. ప్రిన్స్ యావర్ పై చేసిన ఆరోపణలు కూడా సరిగ్గా లేవు అని చెప్పిన జ్యూరీ మెంబర్స్.. ప్రిన్స్ యావర్ ప్రవర్తించిన తీరుపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్స్, గౌతమ్ ఇద్దరూ కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్లడంతో ఏం చేయాలో శివాజీకి అర్థం కాలేదు. ప్రిన్స్ తన బోనులో నుంచి బయటికి వచ్చి చేసిన చేష్టల ఆధారంగా ప్రిన్స్ ను నామినేట్ చేస్తున్నామని శివాజీ చెప్పడంతో అలా కుదరదు.. జ్యూరీ సభ్యులకు వాళ్లను నామినేట్ చేసే అధికారం ఉండదని.. అది పూర్తిగా నామినేట్ చేసే వ్యక్తి కారణాల మీద ఆధారపడి ఉంటుందని బిగ్ బాస్ చెబుతాడు.

Advertisement

#image_title

దీంతో ప్రిన్స్ ఫోటోను అక్కడి నుంచి తీస్తాడు శివాజీ. దీంతో రెచ్చిపోతాడు గౌతమ్. ఏ టాస్క్ జరిగినా ఓడిపోయిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి అదే టైప్ బిహేవియర్ చూపిస్తున్నాడు అంటే.. ప్రతి ఒక్కరి గురించి నీకు అనవసరం అంటాడు శివాజీ. దీంతో అందరూ నా ఫ్యామీలీనే అంటాడు గౌతమ్. దీంతో మనం గేమ్ ఆడుతున్నాం. ఇది ఫ్యామిలీ కాదు అంటాడు శివాజీ. దీంతో మీరు లాయర్ లాగా ఒక్క సైడే మాట్లాడుతున్నారు అంటాడు గౌతమ్. దీంతో శివాజీకి కోపం వస్తుంది.

Advertisement

Bigg Boss Telugu 7 : మంచిది నాన్న అంటాడు శివాజీ

దీంతో సరే మంచిది నాన్న అంటాడు శివాజీ. దీంతో కోపంతో తన చేతుల్లో ఉన్న గొడుగును కూడా విసిరేసి.. నువ్వెంత అని శివాజీని పట్టుకొని అంటాడు గౌతమ్. ఆ తర్వాత అమర్ దీప్ గౌతమ్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి నీకు రిఫ్లెక్షన్ వచ్చింది కానీ.. నువ్వు ట్రాక్ మారిపోతున్నావు అంటాడు అమర్ దీప్. పిచ్చా ఏమన్నా నీకు నువ్వు బాంబు పెట్టుకుంటున్నావు అంటాడు అమర్ దీప్. మరోవైపు నువ్వు మాట్లాడిన ఆ లాస్ట్ రెండు మాటలు నాకు కూడా నచ్చలేదు అంటాడు సందీప్. మరోవైపు ప్రశాంత్ ను నామినేట్ చేసి నువ్వు మాస్క్ ఎప్పుడు తీస్తావో అప్పుడే గేమ్ ఆడినట్టు అంటాడు అమర్ దీప్. ఇద్దరి మధ్య కూడా బాగానే గొడవ జరుగుతుంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి