
#image_title
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది. ‘ రంగస్థలం ‘ సినిమాతో రంగమ్మత్తగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ‘ పెద్దకాపు-1 ‘ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విరాట్ కర్ణ , ప్రగతి హీరో హీరోయిన్లుగా నటించారు.
ద్వారక క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో జరుపుకున్నారు చిత్ర బృందం. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అనసూయ సందడి చేసింది. వేదిక మీద నానా హంగామా చేసింది. ఎప్పటిలాగే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలుచటి చీరలో అందాలను వడ్డించింది. మరోసారి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ఈవెంట్లో హడావిడి అంతా అనసూయదే కనిపించింది. ఈ ఈవెంట్ కి అనసూయ మరోసారి తన అందంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
#image_title
ఆ ఈవెంట్లో అనసూయ వేదిక మీదకు రాగానే ఆడియన్స్ అంత ఒక్కసారిగా గోల చేశారు. ఇక అనసూయ మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర పేరు అక్కమ్మ. రంగస్థలంలోని రంగమ్మత్త పాత్ర ఎంత గుర్తింపు తెచ్చిందో ఈ అక్కమ్మ పాత్ర కూడా అంతే గుర్తింపు తెస్తుంది అని అనుకుంటున్నాను అని తెలిపింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ పెదకాపు సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది. ఇలా పెదకాపు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అనసూయ సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
This website uses cookies.