Home » Entertainment » Genelia With Riteish Deshmukh
Entertainment

Genelia : పొద్దుపొద్దున్నే ఇవేం పనులు.. భర్తతో జెనీలియ సరసాలు

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 23, 2021, 3:26 pm
Advertisement

Genelia :  ఒకప్పుడు జెనీలియా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. వరుసగా చిత్రాలను చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వరుసగా స్టార్స్‌తో నటించి బ్లాక్ బస్టర్‌లను ఖాతాలో వేసుకుంది. బొమ్మరిల్లులో జెనీలియా చేసిన హాసిని పాత్రతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అలా అప్పటి నుంచి జెనీలియాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడంప్రారంభించారు. అలా జెనీలియా ఇక్కడ ఢీ, రెడీ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

Advertisement

Genelia Video with Riteish deshmukh

అయితే ఇక్కడి ఫాలోయింగ్, క్రేజ్‌తో జెనీలియా బాలీవుడ్‌లో మంచి ఆఫ్లర్లు కొట్టేసింది. అక్కడే రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడింది. వివాహాం తరువాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. పిల్లలు, భర్తే లోకంగా జెనీలియా తన జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు జెనీలియా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. మన తెలుగు హీరోలతో జెనీలియా సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా రామ్‌తో క్లోజ్‌గా ఉంటుంది.

Advertisement

భర్తతో జెనీలియా సరసాలు..

అయితే సోషల్ మీడియాలో జెనీలియా ఎక్కువగా తన పిల్లలు, భర్తకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తమ మధ్య ఉన్న ప్రేమ బంధానికి గుర్తుగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో జెనీలియా ఇంకా బెడ్ మీద నుంచి లేవనలేదు.. కానీ రితేష్ మాత్రం షర్ట్ లేకుండా అలా లేచి జెనీలియాతో సరసాలు ఆడాడు. అదంతా కూడా జెనీలియా వీడియో తీసింది. ఎప్పుడూ ప్రేమలోనే ఉండేవారి కథ అంటూ జెనీలియా ఆ వీడియోను షేర్ చేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి