Getup Srinu Frustration on Jabradasth Love Tracks
Getup Srinu : జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను ఎంట్రీతో అంతా మారిపోయింది. ఇప్పుడు శ్రీను అదరగొట్టేస్తున్నాడు. మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టు ఉంది. ఒకే స్కిట్లో కాకుండా రెండు స్కిట్లలో శ్రీను ఎంట్రీ ఇస్తున్నాడు. వేరే వారి స్కిట్లో స్పెషల్ కారెక్టర్ వేస్తున్నాడు. ఇక శ్రీను ఇప్పుడు దుమ్ములేపుతున్నాడు. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో గెటప్ శ్రీను నిజంగానే తన మనసులోని మాట చెప్పాడా? లేదా స్క్రిప్ట్ ప్రకారం చెప్పాడా? అన్నది తేలడం లేదు. యమ ధర్మరాజుగా గెటప్ శ్రీను ఎంట్రీ ఇచ్చాడు. లవర్స్‌లా నటిస్తూ ఫేమస్ అయిన ఆర్టిస్టులందరినీ జోడిగా మార్చి నరకానికి తీసుకొచ్చారు. రాకేష్ సుజాత ఎలా చచ్చారు? అని యముడిలా ఉన్న గెటప్ శ్రీను అడిగితే..
వీళ్ల పెళ్లికి ఇంట్లో ఒప్పుకున్నారు అందుకే చచ్చారు అని రాం ప్రసాద్ అంటాడు. అదేంటి? అని అంటే.. ఒప్పుకోరు కదా? అని ప్రేమించుకున్నారు.. ఇప్పుడు ఒప్పుకున్నారు అని రాం ప్రసాద్ చెప్పడంతో శ్రీను షాక్ అవుతాడు. ఇక వర్ష ఇమాన్యుయేల్ జోడికి లవ్ సాంగ్ వేస్తారు. దీంతో గెటప్ శ్రీను పచ్చి బూతులు తిట్టేస్తాడు. కానీ వాటిని బయటకు అనడు. నువ్ కాదన్న రోజు నా ఊపిరి ఉండదు అని వర్ష చెప్పే డైలాగ్‌కు గెటప్ శ్రీను వింత రియాక్షన్లు ఇస్తాడు. అంతే కాకుండా..
Getup Srinu Frustration on Jabradasth Love Tracks
ఫైమా ప్రవీణ్‌లు వస్తున్నప్పుడు ఏదో లవ్ సాంగ్‌ను బ్యాక్ గ్రౌండ్‌లో వేస్తారు. దీంతో స్టేజ్ దిగి వచ్చి మరీ కెమెరామెన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లను తిడతాడు. అవన్నీ అవసరమా? ఏవేవో వేసి.. ఏదేదో క్రియేట్ చేస్తారు.. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు అంటూ అసహనంతో అక్కడి నుంచివెళ్లిపోతాడు గెటప్ శ్రీను. చూస్తుంటే.. బయటి జనాల ఫ్రస్ట్రేషన్‌ను ఇలా శ్రీను బయట పెట్టేసినట్టు కనిపిస్తోంది.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.