Ghani Movie : వరుణ్ తేజ్ కెరీర్ లో 10 వ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగా వారసుడిగా ముకుంద సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రెండవ సినిమా తోనే మెగా ప్రిన్స్ అనిపించుకొని డిఫ్రెంట్ జోనర్ లో సినిమాలని ఎంచుకుంటూ వరసగా హిట్స్ అందుకుంటున్నాడు. హీరోగా మారిన కొదీ కాలంలోనే స్టార్ డం ని సంపాదిచుకున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇప్పటికే కంచె, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2, లోఫర్, గద్దల కొండ గణేష్ ఎక్కువగా సూపర్ హిట్స్ ఉన్నాయి.
మధ్యలో మల్టీస్టారర్స్ లో కూడా నటిస్తున్న ఈ మెగా ప్రిన్స్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో వరుణ్ తేజ్ కెరీర్ లో 10 వ సినిమాగా తెరకుక్కుతున్న సినిమా కాగా మరొక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3. ఈ రెండు సినిమాలు రెండు డిఫ్రెంట్ జోనర్స్ లో తెరకెక్కుతున్నాయి. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ ఒకవైపు వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 చేస్తూనే మరొక వైపు బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్స్ ఎంటర్‌టైనర్ ని చేస్తున్నాడు. అయితే గత ఏడాదే వరుణ్ తేజ్ 10 రిలీజ్ కావాల్సి ఉండగా కోవిడ్ వల్ల ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది. కాగా ఈ రెండు సినిమాలని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.
కాగా ఈ రోజు మెగా ప్రిన్స్ వరున్ తేజ్ బర్త్ డే సందర్భంగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి టైటిల్ తో పాటు వరుణ్ తేజ్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘ గని ‘ అన్న టైటిల్ ని ఫిక్స్ చేసి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి ముందు నుంచి బాక్సర్ అన్న టైటిల్ ప్రచారం లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు వెంకటేవ్(బాబీ) – సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. కొర్రపాటి కిరణ్ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.