
Trisha : ఎంత బ్రతిమాలినా వినలేదు.. త్రిష వలన నా జీవితం నాశనం అయిందంటూ సంచలన కామెంట్స్
Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ బిగినింగ్ లో త్రిష వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ అమ్మడు తమిళంలో కూడా రాణించింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల ప్రభావంతో త్రిష క్రేజ్ తగ్గింది. దీనితో త్రిష కొంతకాలం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో కెరీర్ నెట్టుకొచ్చింది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకలను కట్టిపడేసింది. ఇప్పటికీ అదే అందం, అభినయంతో సౌత్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది. 20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది .
మధ్యలో త్రిష కెరీర్ నెమ్మదించిన ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది. అగ్ర హీరోల చిత్రాల్లో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. పొన్నియన్ సెల్వం, లియో లాంటి చిత్రాలలో నటించి మునుపటి హవా ప్రదర్శిస్తోంది. హీరోయిన్లకి ఫార్టీ ప్లస్ తర్వాత ఈ రకమైన క్రేజ్ ఉండడం చాలా అరుదు అని చెప్పొచ్చు. ఇటీవల నిర్మాత గిరిధర్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ త్రిష గురించి సంచలన వ్యాఖ్యలుచేశారు… ‘నటి త్రిషతో తాను ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్నా.. థ్రిల్లర్ మూవీ చేయమంటే నో చెప్పింది. ఆ సమయంలో డైరెక్టర్ గోవర్థన్ రెడ్డి ఓ కథతో వచ్చారు. అదే నాయకి స్టోరీ. ఆ స్టోరీ విని వెంటనే ఓకే చెప్పింది నటి త్రిష.వెంటనే నాయికి. చాలా ఊషారుగా మొదలైంది. కానీ, మధ్యలోనే కష్టాలు మొదలయ్యాయి. సంపాదించిదంతా.. తీసుకెళ్లి సినిమాపై పెట్టాను. ఎక్కడ లాస్ రాకూడదని ఇటు తెలుగు అటూ తమిళ వర్సెన్ తో తీశాను. కానీ నష్టపోయా.. అప్పడు అర్థమైంది.. తెలియని భాషలో అస్సలు సినిమాలు తీయకూడదు’అని నిర్మాత గిరిధర్ అన్నారు.
Trisha : ఎంత బ్రతిమాలినా వినలేదు.. త్రిష వలన నా జీవితం నాశనం అయిందంటూ సంచలన కామెంట్స్
నాయికి మూవీ వల్ల తనకు, త్రిషకు ఉన్న రిలేషన్ చెడిపోయింది. అది కేవలం డైరెక్టర్ వల్లే.. సినిమా 10 కోట్లు చేరిందనీ డైరెక్టర్ చెప్పడం, కానీ ఇక్కడ అంత మ్యాటర్ లేకపోవడం. రెమ్యూనరేషన్ ప్రకారం తేడా వచ్చింది. నేను తమిళ సాటిలైట్ రైట్స్ ఇద్దామనుకుంటే.. త్రిష మాత్రం కోటీ రూపాయాలైన ఇవ్వాలని డిమాండ్ చేయడం. ఇలా ఇబ్బందిపడ్డాను’ అని నిర్మాత గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఇదిలా ఉంటే.. దళపతి విజయ్ ‘గోట్’ చిత్రంలో నటి త్రిష కృష్ణన్ అతిధి పాత్రలో నటించింది. ఆమె ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట కోసం విజయ్‌తో జతకట్టినట్టు సమాచారం. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయక చతుర్థి పండుగ కానుకగా సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజ్ చేశారు
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.