guppedantha manasu 10 september 2022 full episode
Guppedantha Manasu 10 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 సెప్టెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 552 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది. రిషిని ఎలా ఒప్పించావు అని జగతి, మహీంద్రా ఇద్దరూ వసుధారను తన రెస్టారెంట్ లో కలిసి అడుగుతారు. అది నా ఆలోచన కాదు సార్ అంటుంది వసుధార. మరి ఎవరి ఆలోచన.. రిషిని అడగమని ఎవ్వరు చెప్పారు.. ధరణి అడగమన్నదా అని అంటాడు మహీంద్రా. దీంతో దేవయాని మేడమ్ అంటుంది వసు. దీంతో మహీంద్రా, జగతి ఇద్దరూ షాక్ అవుతారు. దేవయాని అడగమని అన్నదంటే తను ఏదో ప్లాన్ వేస్తోంది అని అంటుంది జగతి. సాక్షి వెళ్లిపోయినప్పటి నుంచి అక్కయ్య దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. తను ఖాళీగా ఉందంటే ఏదో ప్రమాదం రాబోతోంది అని అనుకుంటుంది జగతి.
guppedantha manasu 10 september 2022 full episode
మరోవైపు వసు కళ్లు మూసుకుంటుంది. దీంతో ఏమైంది వసు అని అడుగుతుంది జగతి. మేడమ్.. రిషి సార్ వస్తున్నట్టున్నారు అని చెబుతుంది వసు. దీంతో కారు హారన్ మాకేం వినపడలేదు. నీకు వినిపించిందా అని అడుగుతుంది జగతి. దీంతో కారు హారన్ కాదు మేడమ్.. నాకెందుకో అలా అనిపించింది. అలా అనిపించినవి అప్పుడప్పుడు అలా అర్థం అవుతాయి అని అంటుంది వసు. దీంతో జగతి.. దీన్నే ప్రేమ అని కూడా అంటారేమో అంటాడు మహీంద్రా. ఇంతలో రిషి అక్కడికి వస్తుంటాడు. అతడిని చూసి వసు షాక్ అవుతుంది. నువ్వు చెప్పినట్టే వచ్చేశాడు అంటాడు మహీంద్రా. హాయ్ రిషి అంటాడు మహీంద్రా. జగతి.. మనం వెళ్దాం పదా అంటాడు మహీంద్రా. ఏం డాడ్.. నేను రాగానే వెళ్లిపోతున్నారు.. అని అడుగుతాడు రిషి. దీంతో అదేం లేదు.. ఇప్పుడే కాఫీ తాగం… వెళ్దామనుకునేలోపే నువ్వు వచ్చావు అంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఇద్దరూ వెళ్లిపోతారు.
సార్.. ఆర్డర్ ప్లీజ్ అని అడుగుతుంది వసు. దీంతో నేను ఆర్డర్ ఇవ్వడానికి రాలేదు. పదా వెళ్దాం అని అంటాడు రిషి. దీంతో నాకు డ్యూటీ ఉంది సార్ అంటుంది వసుధార. అయితే… నాకు ఒక కాఫీ తీసుకురా. నేను కాఫీ తాగేలోపు నువ్వు పర్మిషన్ తీసుకొనిరా. బయటికి వెళ్దాం అంటాడు రిషి.
మరోవైపు మహీంద్రా, జగతి పెళ్లి రోజు వేడుకల కోసం ఏం సామాన్లు కావాలో లిస్టును గౌతమ్ కు చెబుతుంది దేవయాని. కేక్, ఇతర వస్తువులు తెమ్మని చెబుతుంది. దీంతో కేక్ సెలక్షన్ లో రిషి అయితే బెటర్ అని చెబుతాడు గౌతమ్.
కట్ చేస్తే కారులో రిషి, వసుధార ఇద్దరూ ఇంటికి వస్తారు. వాళ్లను చూసి షాక్ అవుతుంది దేవయాని. ఇప్పుడు వసుధార అంటే కోపం ఉన్నా పైకి ప్రేమ ఉన్నట్టు నటించాలి అని అనుకుంటుంది దేవయాని.
రా వసుధార.. అక్కడే ఆగిపోయావు ఏంటి.. లోపలికి రా. పరీక్షలు ఎలా రాశావు. బాగా రాశావట కదా.. అందరూ చెబుతున్నారు అంటుంది దేవయాని. అయినా నువ్వు ఇప్పటికే చాలా విజయాలు సాధించావు అంటుంది దేవయాని.
వసుధారను నేనే తీసుకొచ్చాను పెద్దమ్మ అని అంటాడు రిషి. అవును రిషి.. నువ్వు చెప్పింది కరెక్టే. నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. నేను రమ్మని చెబుదామనుకున్నా. కానీ.. మొన్నే పరీక్షలు అయిపోయాయి కదా. వసుధార రా.. కూర్చో. ఇది నీ ఇల్లే అనుకో…. ఏం టెన్షన్ పడకు అంటుంది దేవయాని.
దీంతో అర్థం చేసుకోవాలి కానీ.. పెద్దమ్మది మంచి మనసు వసుధార అంటాడు రిషి. ఇంతలో జగతి వస్తుంది. మేడమ్.. ఏవైనా పనులు ఉంటే వసుకు చెప్పండి అంటాడు రిషి. దీంతో సరే అంటుంది జగతి.
కానీ.. దేవయాని ప్రవర్తన.. జగతికి అనుమానం కలిగిస్తుంది. తర్వాత అందరూ కుర్చొని భోజనాలు చేస్తారు. రిషి పక్కనే కూర్చొంటుంది వసు. దీంతో తనకు రిషినే వడ్డిస్తాడు. దీంతో దేవయానికి చాలా కోపం వస్తుంది.
తర్వాత కావాలని దేవయానిని పొగుడుతాడు మహీంద్రా. అవును అత్తయ్య రిషికి మీకు ఇద్దరికీ కొన్ని పోలికలు ఉన్నాయి అంటుంది ధరణి. నేను మీ ఇద్దరి విషయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను అంటుంది ధరణి.
దీంతో మున్ముందు ఇంకా ఆశ్చర్యపోతావులే అంటుంది దేవయాని. అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకు. నీకు ఎక్కువగా పనులు ఉంటాయి కదా అంటుంది దేవయాని. దీంతో సరే అత్తయ్య అంటుంది ధరణి.
తర్వాత జగతి, ధరణి, గౌతమ్, వసుధార అందరూ కలిసి పూలు గుచ్చుతూ ఉంటారు. ఇంతలో రిషి, మహీంద్రా ఇద్దరూ కిందికి వస్తారు. రిషి.. వసును చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనం కూడా పూలు అల్లుదాం అంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.