Guppedantha Manasu 14 Jan Today Episode : వసుధారకు క్షమాపణ చెప్పిన చక్రపాణి.. రిషిని కలవడానికి వసుధార వెళ్తుందా? రిషి ఏం చేస్తాడు?

Advertisement
Advertisement

Guppedantha Manasu 14 Jan Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జనవరి 2023, శనివారం ఎపిసోడ్ 660 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంతలా నన్ను మాయ చేసి వేరే వాళ్లతో తాళి ఎలా కట్టించుకున్నావు వసుధార. నీకిది న్యాయమా అని కాలేజీకి వెళ్లి అక్కడ కూర్చొని బాధపడుతుంటాడు రిషి. ఇందుకేనా నన్ను కాపాడింది.. రక్షించింది. ఇలా క్షణక్షణం చంపడానికా అని అనుకుంటాడు. నాకేమైనా జరిగితే నీ ఊపిరి ఆగిపోతుందన్నావు. ఇప్పుడు నువ్వే నా ఊపిరి తీస్తున్నావు. నీ మెమోరీస్ తో అని అనుకుంటాడు. ఈ మెమోరీస్ ఇప్పుడు నాకు వడగళ్ల వానగా మారాయి అని వసుధార కూడా అదే అనుకుంటుంది. ఒకసారి రిషి సార్ కు ఒకసారి ఫోన్ చేసి హలో అనగానే కట్ చేస్తాను అని అనుకుంటాడు రిషి. ఇన్ని గంటలా తన మాట వినకుండా ఉండి. రిషి సార్ కు ఫోన్ చేస్తే ఎన్నో ప్రశ్నలు వేస్తారు. నేను ఇప్పుడే సమాధానాలు చెప్పలేరు. నాన్న ఫోన్ తో రిషి సార్ కు ఫోన్ చేస్తాను. నా ఫోన్ లో రిషి సార్ మాటలను సేవ్ చేసుకుంటాను అనుకుంటుంది వసుధార. ఇంతలో రిషికి ఫోన్ వస్తుంది. వసుధార నాన్న నెంబర్ నుంచి చేయడంతో ఇది కొత్త నెంబర్ లా ఉంది అని అనుకుంటాడు.

Advertisement

guppedantha manasu 14 january 2023 full episode

లిఫ్ట్ చేయాలా అవసరమా అనుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ ఏదైనా అర్జెంట్ అయితే అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వసుధార.. నువ్వేనా? హల్ మాట్లాడండి. ఎవరు ఫోన్ చేసింది. హలో మాట్లాడండి అంటాడు. కానీ.. తన మాటలను రికార్డు చేసుకొని ఆ తర్వాత ఫోన్ కట్  చేస్తుంది వసుధార.  దీంతో మళ్లీ ఆ నెంబర్ కు ఫోన్ చేస్తాడు రిషి. దీంతో కట్ చేస్తుంది. మళ్లీ చేస్తాడు. దీంతో లిఫ్ట్ చేస్తుంది. సారీ అండి రాంగ్ నెంబర్ డయల్ అయింది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. వేరే నర్స్ తో అలా చెప్పిస్తుంది. రిషి సార్ మీరు జెంటిల్ మెన్. నాకు తెలుసు. మీ కోపాలను, సందేహాలను త్వరలో తీర్చే రోజు వస్తుంది సార్ అని అనుకుంటుంది. చక్రపాణి, సుమిత్ర బిల్ పే చేయడం కోసం వసుధార వెళ్లగా.. రిషి కట్టేశారు అని అంటుంది రిసెప్షనిస్ట్.

Advertisement

ఇంతలో చక్రపాణి వస్తాడు. నాన్నా రిషి సార్ బిల్లు కట్టారట అని చెబుతుంది. దీంతో అవునమ్మా.. నేను చూశాను. రిషి వచ్చినప్పుడే నేను ఆయన గురించి తెలుసుకున్నాను. ఆయన మంచితనం కూడా తెలిసింది. తొందరగా వెళ్లి రిషి సార్ ను కలుసుకో అమ్మ అంటాడు చక్రపాణి.

మరోవైపు కాలేజీలో రిషి సార్ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారని కాలేజీ లెక్చరర్స్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు వసుధార రాలేదు. జగతి కాలేజీకి రానని వచ్చింది. అసలు ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అని అనుకుంటారు.

అవన్నీ విన్న జగతి.. మేడమ్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు. ఒక సబ్జెక్ట్ దొరికితే ఏది పడితే అది మాట్లాడుతారా? మీకు ఉద్యోగాలు ఇచ్చి నెల నెలా జీతాలు ఇస్తుంటే మీరు భూషణ్ ఫ్యామిలీనే విమర్శిస్తున్నారా? అంటూ సీరియస్ అవుతుంది జగతి.

Guppedantha Manasu 14 Jan Today Episode : సుమిత్రను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చిన వసుధార

లెక్చరర్లకు జగతి క్లాస్ పీకడం చూస్తాడు రిషి. ఒక మనిషి బాధపడుతుంటే మనం బాధపడాలి. అది సంస్కారం అంటుంది. మరోవైపు సుమిత్రను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తాడు చక్రపాణి.

ఇల్లు అంతా గందరగోళంగా ఉండటం చూసి చక్రపాణి చాలా బాధపడతాడు. తినడానికి ఏమైనా తీసుకురమ్మంటావా అమ్మా అంటుంది వసుధార. దీంతో వద్దమ్మా అంటుంది సుమిత్ర. నీళ్లు తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది వసుధార.

తాగమ్మ అంటుంది. చాలా అంటుంది. ఆ తర్వాత చక్రపాణి అక్కడే కింద కూర్చొంటాడు. నాన్న.. ఇంకేం ఆలోచించకండి నాన్న అంటుంది వసుధార. దీంతో ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా. జరిగింది చిన్న విషయం కాదు కదా అంటాడు.

గండం గడిచింది అనుకోవాలా? మంచి జరిగింది అనుకోవాలా? నీ భవిష్యత్తు పాడవకుండా ఆగింది అనుకోవాలా? అసలు ఏం ఆలోచించాలన్నది కూడా నాకు అర్థం కావడం లేదు.. అంటాడు చక్రపాణి.

దీంతో నాన్న మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. నా మీద మీకు ఎంత కోపం వచ్చినా.. మీ మీద నాకు ఏం కోపం లేదు నాన్న అంటుంది వసుధార. నాన్న.. ప్లీజ్ ఏడవకండి అంటుంది వసుధార. మా నాన్న ప్రేమగా ఒక మాట్లాడితే బాగుండు.. మా మనసులను అర్థం చేసుకుంటే బాగుండు అనుకున్నా. అంతే.. నీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది నాన్న అంటుంది వసుధార.

దీంతో వెళ్లి వసుధార కాళ్ల మీద పడతాడు చక్రపాణి. నాన్న ఏంటిది. లేవండి నాన్న అంటుంది వసుధార. నాన్న.. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఏంటి ఈ మాటలు అంటుంది వసుధార. నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను అంటాడు చక్రపాణి.

నన్ను క్షమించమ్మా అంటాడు చక్రపాణి. అమ్మ.. నేను మళ్లీ చెబుతున్నాను. నువ్వు నా కూతురువు కాదు అమ్మ. నా అమ్మవు అంటాడు చక్రపాణి. నేను నిన్ను ఎన్ని మాటలు అన్నా ఎంత హింస పెట్టినా నువ్వు ఓపిక పట్టావు. ఎంత భరించావు తల్లి నువ్వు. ఇంత ఓపిక ఒక కన్నతల్లికే ఉంటుందమ్మా. మా అమ్మే నీ రూపంలో పుట్టిందేమో అని అంటాడు.

ఆ తర్వాత రిషి వాచ్ అక్కడే పడిపోయి ఉండటం చూస్తుంది వసుధార. మరోవైపు రిషి.. వసుధార గురించే ఆలోచిస్తూ ఇంట్లో ఒంటరిగా కూర్చొంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Jabardasth Shanthi Swaroop YS Jagan : లేడీకి.. లేడీ గెటప్‌కి తేడా తెలియదా? ఎలా సీఎం అయ్యారు? వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్

Jabardasth Shanthi Swaroop YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'సంక్రాంతి సంబరాల' డ్యాన్స్ వీడియో ఇప్పుడు పెద్ద దుమారమే…

4 hours ago

Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!

Thirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు…

5 hours ago

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

7 hours ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

8 hours ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

9 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

10 hours ago