guppedantha manasu 17 august 2022 full episode
Guppedantha Manasu 17 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 531 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి జగతి.. నిశ్చితార్థం ఆగిపోయిందని స్వీట్లు చేయమంటున్నావా? ఏంటి ధరణి.. అందరి కళ్లు చల్లబడ్డాయా అని అంటుంది దేవయాని. దీంతో గౌతమ్ స్వీట్లు కావాలని అడిగాడు అంటుంది జగతి. ఇలాంటప్పుడే ఎవరి బుద్ధి ఏంటో బయట పడుతుంది అంటుంది దేవయాని. కరెక్టే.. మీ బుద్ధి గురించి మాట్లాడేంత బుద్ధి నాకు లేదు అంటుంది జగతి. ఇంతలో దేవయాని దగ్గరికి వచ్చిన గౌతమ్ పెద్దమ్మ.. సాక్షి వచ్చి మిమ్మల్ని బెదిరించింది. రిషిని పెళ్లి చేసుకోకపోతే కోర్టుకు ఎక్కుతానంది. రిషి ఇందులో చేసిందేముంది. ఆ సాక్షి పెళ్లి వద్దని అన్నది కదా అంటాడు గౌతమ్. ఇంతలో అక్కడికి రిషి వచ్చి.. ఏంట్రా పెద్దమ్మను ఏమంటున్నావు. నేను ఉండగా పెద్దమ్మను ఏం అనడానికి లేదు అంటాడు రిషి.
guppedantha manasu 17 august 2022 full episode
రిషి.. నువ్వేంటో నాకు తెలుసు.. నేనేంటో నీకు తెలుసు కదా అంటుంది దేవయాని. పెద్దమ్మ నువ్వేం బాధపడటం లేదు కదా అంటాడు రిషి. దీంతో పెద్దమ్మకు ఏం బాధలేదురా అంటాడు గౌతమ్. తను సెలబ్రేట్ చేసుకుందాం అంటోంది అంటాడు గౌతమ్. మరోవైపు వీళ్ల సంగతికేం కానీ.. నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. మరోవైపు రిషి చేయించిన ఉంగరాన్ని తీసుకొని ఆటోలో వెళ్తుంటుంది వసుధర. తనను చూసి ఫోన్ చేసి ఆటో దిగు అంటాడు. మీరు ఎక్కడున్నారు అన్నా కూడా వినడు. ముందు నువ్వు ఆటో దిగు అంటాడు రిషి. దీంతో ఆటో దిగుతుంది. ఇంతలో కారులో వస్తాడు రిషి. కూర్చో అంటాడు. దీంతో తను కారులో కూర్చొంటుంది.
మరోవైపు మహీంద్రా, జగతి, ధరణి ముగ్గురూ చాలా సంతోషంగా ఉంటారు. ఎక్కడ రిషి, సాక్షి పెళ్లి జరుగుతుందో అని తెగ టెన్షన్ పడ్డా అంటాడు మహీంద్రా. కానీ.. సాక్షి గారు నాకు పెళ్లి వద్దు అని చెప్పి వెళ్లిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు మహీంద్రా.
మరోవైపు రిషి నా గుప్పిట్లో నుంచి జారిపోయాడు అని అనుకుంటుంది దేవయాని. ఇప్పుడు వసుధరకు లైన్ క్లియర్ అయిపోయింది. సాక్షి ఇలా చేసిందేంటి అని అనుకుంటుంది. కోపం వస్తుంది తనకు. తను రూమ్ లో అన్ని సామాన్లు విసిరేస్తుంది.
నేనేది కావాలని చేయలేదు అని వసుధరతో అంటాడు రిషి. మీరు నాకు సంజాయిషీ ఇవ్వడం ఏంటి అంటుంది వసుధర. ఒక్కోసారి సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది. నా జీవితంలో తుఫాను వెలిసినట్టు ఉంది. సాక్షి నాకు దూరం అయిందని నాకు ఇప్పుడు ఏం బాదలేదు అంటాడు రిషి.
రిషి, వసుధర ఇద్దరూ కలిసి హోటల్ కు రావడం చూస్తారు మహీంద్రా, జగతి, గౌతమ్. వాళ్లు కూడా అదే హోటల్ కు వస్తారు. జగతి ఏంటి ఇది అంటాడు మహీంద్రా. మనం ఇంకో కేక్ కట్ చేయాలి అంటాడు. వసుధర, రిషి ఇద్దరూ కలిసి రావడం చూసి షాక్ అవుతారు.
మరోవైపు వదిన కాఫీ ఇవ్వు అంటాడు రిషి. దీంతో కాఫీ నేను ఇవ్వనా సార్ అంటుంది జగతి. దీంతో మేడమ్ మీరు ఇప్పటి నుంచి నన్ను సార్ అని పిలవకండి. రిషి అని పిలిస్తే చాలు అంటాడు రిషి. దీంతో జగతి సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.