Home » Entertainment » Intinti Gruhalakshmi 17 August 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 17 Aug Today Episode : సముద్రంలో అలలకు కొట్టుకుపోయిన తులసి బతుకుతుందా? తులసి ఎవరో నందు.. సామ్రాట్ కు అసలు నిజం చెప్పేస్తాడా?

Authored By
Varun G
The Telugu News | Published on: August 17, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 17 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 713 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రెడీ అయి తులసి రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొడతాడు సామ్రాట్. తులసి డోర్ ఎందుకు కొట్టాడు అని అనుకుంటారు లాస్య, నందు. ఇంతలో తులసి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇవాళ ఎలాగూ మీటింగ్ లేదు కదా.. అలా బయటికి వెళ్దామని అనుకుంటున్నా. మీరు కూడా వస్తారా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో సరే వస్తాను అంటుంది. తర్వాత ఆటో బుక్ చేసుకొని వస్తాడు సామ్రాట్. మీరేంటి ఆటో బుక్ చేసుకొని వచ్చారు అంటుంది తులసి. దీంతో ఇది పర్సనల్ టైమ్ కదా.. మన ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు అంటాడు సామ్రాట్. దీంతో ఆటో ఎక్కి తులసి, సామ్రాట్ అలా వైజాగ్ తిరగడానికి వెళ్తారు.

Advertisement

intinti gruhalakshmi 17 august 2022 full episode

మరోవైపు అంకిత.. ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శృతి కోసం వెళ్లిన ప్రేమ్ ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటుంది. ఇంతలో ప్రేమ్ ఒక్కడే రావడాన్ని చూస్తుంది అంకిత. ఇదేంటి ప్రేమ్ ఒక్కడే వస్తున్నాడు అని అనుకుంటుంది అంకిత. అతడికి ఎదురు వెళ్తుంది. తనను చూసి ఆగకుండా వెళ్తాడు ప్రేమ్. దీంతో ప్రేమ్ ఆగు అంటుంది అంకిత. శృతిని కలిశావా ప్రేమ్ అంటుంది అంకిత. శృతి ఏం చెప్పింది అని అడుగుతుంది అంకిత. దీంతో ఈరోజుతో నాకు, శృతికి మధ్య ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోయింది అంటాడు ప్రేమ్. దీంతో అంకిత షాక్ అవుతుంది. నా అవసరం లేదని మొహం మీదే చెప్పేసింది అంటాడు ప్రేమ్. దీంతో ఆవేశంలో అలా మాట్లాడి ఉంటుంది. తనను తప్పుగా అర్థం చేసుకోకు అంటుంది అంకిత. దీంతో నువ్వు తనను బలవంతంగా లాక్కొచ్చినా తన మనసు అలా ఉండదు. అంతకంటే.. ఎవరి బతుకు వాళ్లు బతకడం మేలు అంటాడు ప్రేమ్.

Advertisement

దీంతో షట్ అప్ ప్రేమ్. అంకుల్ కు విడాకులు ఇచ్చి ఆంటి ప్రస్తుతం ఎంత బాధపడుతోందో తెలుసు కదా అంటుంది అంకిత. నువ్వు ఇన్ని రోజులు తనను పట్టించుకోకపోయేసరికి శృతి బాధపడి ఉంటుంది. తనకు కొద్దిగా సమయం ఇవ్వు. తను కుదుటపడ్డాక మాట్లాడుదాం అంటుంది అంకిత.

Intinti Gruhalakshmi 17 Aug Today Episode : తులసిని సముద్రం దగ్గరికి తీసుకెళ్లిన సామ్రాట్

దీంతో ఎవరు ఎన్ని చెప్పినా నేను వినే స్థితిలో లేను అంటాడు ప్రేమ్. కట్ చేస్తే ఆటోలో వైజాగ్ అంతా తిరుగుతుంటారు సామ్రాట్, తులసి. ఒక చోట దిగాక.. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది తులసి. దీంతో సర్ ప్రైజ్ అంటాడు సామ్రాట్.

Advertisement

మీరు కళ్లు మూసుకోండి అంటాడు సామ్రాట్. దీంతో కళ్లు మూసుకుంటుంది తులసి. చెయ్యి ఇవ్వండి అంటాడు సామ్రాట్. తన చేయి పట్టుకొని నాతో రండి అంటాడు. మరోవైపు వీళ్లు ఎక్కడికి వెళ్లారు అని వాళ్లతో పాటు లాస్య, నందు వెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు అంటుంది.

చివరకు తనను సముద్రం దగ్గరికి తీసుకెళ్తాడు సామ్రాట్. ఆ తర్వాత నెమ్మదిగా కళ్లు తెరవండి అంటాడు సామ్రాట్. కళ్లు తెరిచి సముద్రాన్ని చూసి షాక్ అవుతుంది తులసి. వెంటనే పరందామయ్యకు ఫోన్ చేస్తుంది. మామయ్య నేను సముద్రం దగ్గర ఉన్నాను. ఎంత సంతోషంగా ఉందో మామయ్యా అంటుంది తులసి.

తర్వాత తన ఆనందాన్ని చూడటం కోసమే సముద్రం దగ్గరికి తీసుకొచ్చా అంటాడు సామ్రాట్. బ్యాగ్ తీసుకొని వెళ్లబోతుంటే బ్యాగ్ ఇటు ఇవ్వండి.. మీరు వెళ్లండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటాడు సామ్రాట్. దూరంగా ఉన్న బండ దగ్గరికి మాత్రం వెళ్లొద్దు. అక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమాదం అంట అంటాడు సామ్రాట్.

దీంతో సరే అని చెప్పి వెళ్లి సముద్రం వద్ద చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తుంది తులసి. ఇంతలో సామ్రాట్ కు ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సామ్రాట్. తులసి తన ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉంటుంది. ఇంతలో అందరూ పరిగెడుతుండటం చూస్తాడు సామ్రాట్.

Advertisement

దీంతో ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఒకావిడ అలలలో కొట్టుకుపోయిందట అని చెబుతారు. దీంతో తులసి అనుకొని తులసిని వెతకడం కోసం పరిగెడతాడు సామ్రాట్. తనను లోపలికి వెళ్లనీయరు అక్కడున్న వాళ్లు. తులసి గారు అంటూ అరుస్తాడు సామ్రాట్.

మరోవైపు తులసి గురించి విషయం తెలుసుకొని నందు.. సామ్రాట్ పై సీరియస్ అవుతాడు. తులసి విషయంలో మీరు హద్దులో ఉంటే మంచిది అంటాడు నందు. తను నా మాజీ భార్య అని చెబుతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దవుతుంది. అందరి ముందే ఇద్దరూ కొట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి