Guppedantha Manasu 19 Nov Today Episode : వసుధార ఇంటర్వ్యూ ఇవ్వకుండా ప్లాన్ వేసిన దేవయాని.. మహీంద్రా రాలేదని కోపంతో రిషి ఏం చేస్తాడు?

Guppedantha Manasu 19 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. మహీంద్రాను కాదని జగతి.. కాలేజీకి వెళ్తుంది. అక్కడ రిషి, వసుధార ఇద్దరు మాట్లాడుకోవడం చూసి సంతోషిస్తుంది. కట్ చేస్తే దేవయాని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకూడదు. నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని అంటుంది దేవయాని. ఇదేం పెద్ద విషయం కాదు. నువ్వు మాత్రమే చేయగలవు. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అర్థం అయింది కదా. నేను మళ్లీ నీకు ఫోన్ చేయను. పని అయ్యాక నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిపోతుంది అంటుంది దేవయాని. అయితే.. దేవయాని మాటలను.. వెనుక నుంచి ధరణి వింటుంది. అసలు.. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది.

guppedantha manasu 19 november 2022 full episode

అయితే.. వెనుక నుంచి ఎవరో తన ఫోన్ లోని మాటలు వింటున్నారని అనుకున్న దేవయాని.. ధరణి అని గట్టిగా పిలుస్తుంది. దీంతో కిచెన్ లో నుంచి వచ్చినట్టుగా చెప్పి తాను ఏం వినలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. అత్తయ్య గారు చేస్తున్న కుట్ర ఏంటో అర్థం కావడం లేదు. ఈ విషయం వెంటనే ఎవరికో ఒకరికి చెప్పాలి అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని.. ఎక్కడికి ధరణి హడావుడిగా వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో ఎక్కడికి లేదు. ఊరికే అలా వెళ్తున్నాను అంటుంది ధరణి. ఏదో టెన్షన్ గా కనిపిస్తున్నావు అంటుంది దేవయాని. దీంతో మిమ్మల్ని చూసిన ప్రతి సారి నాకు టెన్షన్ గా ఉంటుంది అంటుంది. సరే.. నాకు బాగా తలనొప్పిగా ఉంది. కాస్త తలపట్టు చాలు అంటుంది. దీంతో ఇప్పుడేనా అంటుంది. అవును.. ఇప్పుడే.. ఏమైనా అర్జెంట్ పనులు ఉన్నాయా నీకు అంటుంది. దీంతో ఏం లేదు అంటుంది.

మన వసుధర ఇంటర్వ్యూకు ఆది దంపతులు వస్తారంటావా అని అడుగుతుంది దేవయాని. దీంతో వస్తే మంచిదే కద అత్తయ్య అంటుంది ధరణి. మరోవైపు మహీంద్రా దగ్గరికి గౌతమ్ వెళ్తాడు. జగతి ఇలా వెళ్లాల్సింది కాదు గౌతమ్ అంటాడు మహీంద్రా.

మేడమ్ వసుధార బాధను అర్థం చేసుకున్నారు. అందుకే వెళ్లారు. మీరు కూడా రండి అంకుల్ అంటాడు గౌతమ్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. అది కూడా మీ పర్మిషన్ తో అంటాడు గౌతమ్.

అసలు జగతి అలా వెళ్లినందుకే నాకు బాధగా ఉంది అంటాడు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కలుస్తారు కదా. ఆ కలిసేది ఏదో ఇప్పుడే కలవండి. కాలేజీ ఫంక్షన్ లో మీరు రిషి పక్కన ఉంటే వాడు ఉప్పొంగిపోతాడు అంటాడు. కానీ.. మహీంద్రా వద్దు రాను అంటాడు.

Guppedantha Manasu 19 Nov Today Episode : దేవయాని ప్లాన్ గురించి గౌతమ్ కు ఫోన్ చేసి చెప్పిన ధరణి

ఇంతలో గౌతమ్ కు ధరణి ఫోన్ చేసి మాట్లాడుతుంది. గౌతమ్ ఇక్కడ అత్తయ్య గారు ఏదో చేస్తున్నారని డౌట్ గా ఉంది నాకు అంటుంది. దీంతో నాకేం అర్థం కావడం లేదు అంటాడు గౌతమ్.

కాలేజీలో ఏదో చేయాలని దేవయాని అత్తయ్య ఎవరినో పురమాయిస్తుండగా నేను విన్నాను. అదేంటో పూర్తిగా అర్థం కాలేదు అంటుంది ధరణి. ఇంతే విన్నారా అంటే ఇంతే విన్నాను. కానీ.. అత్తయ్య గారు ఏదో పెద్ద కుట్ర చేస్తున్నారనిపిస్తోంది అంటుంది ధరణి.

రిషి, వసుధారకు ఫోన్ చేశాను కానీ.. వాళ్లు ఫోన్ తీయలేదు. అందుకే నీకు చేశాను అంటుంది ధరణి. లౌడ్ స్పీకర్ పెట్టడంతో మహీంద్రా కూడా ధరణి మాటలు వింటాడు. మరోవైపు రిషి, వసుధార.. ఇద్దరూ తన క్యాబిన్ లో కూర్చొంటారు.

మేడమ్ వస్తారా రారా.. మేడమ్ రాకపోతే నేను ఇంటర్వ్యూ ఇవ్వలేను అని అనుకుంటుంది వసుధార. నువ్వు టెన్షన్ పడకు. జగతి మేడమ్ వస్తారు అంటాడు. ఇంతలో జ్యూస్ తీసుకొని ఆఫీసు బాయ్ వస్తాడు.

జ్యూస్ తీసుకొని వస్తాడు. కావాలని వసుధర డ్రెస్ మీద జ్యూస్ పోస్తాడు. ఇంతలో పుష్ప వచ్చి మీడియా వాళ్లు వచ్చారని చెబుతుంది. దీంతో వసుధర నువ్వు డ్రెస్ మార్చుకొని రా అని చెబుతాడు రిషి.

దీంతో సరే సార్ అంటుంది. డ్రెస్ మార్చుకోవడానికి ఒక రూమ్ లోకి వెళ్తుంది. డ్రెస్ మొత్తం ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంది. మేడమ్.. మీకిది న్యాయం కాదు మేడమ్. మీరు ఎక్కడున్నారు అని అనుకుంటుంది వసుధార.

కట్ చేస్తే తన రూమ్ లోకి జగతి మేడమ్ వస్తుంది. తనను చూసి షాక్ అవుతుంది. నమ్మలేకపోతుంది వసుధార. నువ్వు సాధించావు. కంగ్రాచ్యులేషన్స్ వసు అంటుంది. మేడమ్ మీరు నిజంగానే వచ్చారా అని సంతోషిస్తుంది వసుధార.

వసు.. గెలిచింది నువ్వు కాదు.. నేను గెలిచాను. రిషి గెలిచాడు. ఈ కాలేజీ గెలిచింది అంటుంది వసుధార. మీరు వచ్చారు మేడమ్ థాంక్యూ అంటుంది వసుధార. ఎక్కడికి వెళ్లారు మీరు. ఏంటి మేడమ్ ఇది. నేను, రిషి సార్ ఎంతలా బాధపడుతున్నామో తెలుసా అంటుంది వసుధార.

వసు.. ఇప్పుడు ఏం అడగకు. నేను ఏం చెప్పలేను. ముందు ఇంటర్వ్యూకు మానసికంగా రెడీగా ఉండు అంటుంది జగతి మేడమ్. నేను జగతి మేడమ్ శిష్యురాలిని. ఒక్క ఇంటర్వ్యూ ఏంటి.. పది ఇంటర్వ్యూలు అయినా ఫేస్ చేస్తాను అంటుంది.

ఇంతలో రిషి వస్తాడు. జగతిని చూసి షాక్ అవుతాడు. మేడమ్ డాడ్ ఎక్కడ అని అడుగుతాడు రిషి. మీరు నాకు కనపడకుండా దాక్కున్నారు కదా అంటాడు రిషి. మేడమ్.. డాడ్ ఎక్కడున్నారు అని మళ్లీ అడుగుతాడు.

డాడ్ రాలేదా అని అడుగుతాడు రిషి. అర్థం అయింది మేడమ్. బాగా అర్థం అయింది. మీ శిష్యురాలి మీద ప్రేమతో మీరొచ్చారు కానీ.. నాకోసం డాడ్ రాలేదు అంటాడు రిషి. అంతే కదా అంటాడు.

తర్వాత రిషి, జగతి ఇద్దరూ బయటికి వెళ్లగా.. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటర్వ్యుకు వస్తా అని చెబుతుంది వసుధార. తను డ్రెస్ మార్చుకుంటుండగా ఇంతలో జ్యూస్ పోసిన ఆఫీస్ బాయ్ వచ్చి డోర్ గడి పెట్టి వెళ్లిపోతాడు.

దీంతో వసుధర ఆ రూమ్ లోనే ఇరుక్కుపోతుంది. వసుధర ఇంకా రావడం లేదేంటని రిషి ఎదురు చూస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Share

Recent Posts

Types Of Kisses : శ‌రీరంపై మీరు పెట్టుకునే ముద్దుతో అవ‌త‌లి వ్య‌క్తిపై మీ ప్రేమ‌ను చెప్పొచ్చు తెలుసా?

Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…

46 minutes ago

Dinner Before 7 pm : రాత్రి భోజ‌నం 7 గంట‌ల‌కు ముందే ముగిస్తే క‌లిగే ఆశ్చ‌ర్య‌క‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…

2 hours ago

Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt : ప్ర‌స్తుతం భార‌త్ - పాక్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆపరేషన్ సింధూర్ త‌ర్వాత పాకిస్తాన్…

3 hours ago

IPL 2025 Postponed : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2025..!

IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు…

4 hours ago

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…

5 hours ago

Brain Healthy : మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా : పదునైన మరియు కేంద్రీకృత మనస్సు కోసం చిట్కాలు

Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…

7 hours ago

Good News : గుడ్‌న్యూస్‌.. కేంద్రం కొత్త ప‌థ‌కంతో ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.1.50 లక్షలు…!

Good News :  భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…

8 hours ago

Sugarcane Juice : వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…

9 hours ago