Home » Entertainment » Guppedantha Manasu 29 August 2022 Full Episode
Entertainment

Guppedantha Manasu 29 Aug Today Episode : వసును దూరం పెడుతున్న రిషి.. రిషి వల్ల డిస్టర్బ్ అయి పరీక్షలు సరిగ్గా రాయని వసు

Authored By
Varun G
The Telugu News | Updated on: August 29, 2022, 9:40 am
Advertisement

Guppedantha Manasu 29 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 541 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా, గౌతమ్ ఇద్దరూ రిషి గదిలోకి వెళ్తారు. ఇద్దరూ అతడు లేచేవరకు వేచి చూస్తారు. లేచాక.. వసు నువ్వు ఇద్దరూ కలిశారు కదా ఏదైనా ఒప్పందానికి వచ్చారా అని అడుగుతాడు గౌతమ్. దీంతో వచ్చాం అంటాడు రిషి. దీంతో మహీంద్రా, గౌతమ్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతారు. కానీ.. ఆ తర్వాత అసలు ఏం జరిగింది అని అంటాడు రిషి. దీంతో వసు, నువ్వు ఇద్దరూ ఏదో ఒప్పందానికి వచ్చారు కదా అని అడుగుతాడు మహీంద్రా. దీంతో అవును వచ్చాం అంటాడు రిషి. వసుధర మంచి స్టూడెంట్. తను మంచిగా చదువుకోవాలి. యూనివర్సిటీ టాప్ రావాలి అంటూ రిషి ఏదేదో చెబుతుంటాడు. దీంతో వీడు ఇక మారడు అని గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

guppedantha manasu 29 august 2022 full episode

మరోవైపు పుష్ప, వసుధర ఇద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. ఏమైంది వసుధర.. త్వరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి. నువ్వేంటి ఏం మాట్లాడటం లేదు. అసలు పరీక్షల గురించి ఏం చెప్పడం లేదంటి అంటుంది. నువ్వు ఇంత వింతగా మాట్లాడటం నేను ఇప్పటి వరకు చూడలేదు అంటుంది పుష్ప. ఇంతలో రిషి తన కోసం కారు ఆపి ఎదురు చూస్తుంటాడు. రిషిని చూసి చాలా సంతోషిస్తుంది వసు. మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు. నాకోసం ఎదురు చూస్తున్నారా? నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్ అని తన చేయి పట్టుకుంటుంది. కానీ.. అదంతా కల. రిషి అక్కడున్నా కూడా ఆయన దగ్గరికి వెళ్లకుండా పుష్ప చేయి పట్టుకొని ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్ అని అంటుంది. ఇంతలో పుష్ప.. జీవితం ఎంత విచిత్రమైనదో కదా అంటుంది వసు.

Advertisement

మనం ఒకటి అనుకుంటాం. అది ఇంకొకటి అవుతుంది. స్వీట్ తినాలనుకుంటాం. స్వీట్ తినకూడని పరిస్థితులు ఏర్పడతాయి అంటుంది. దీంతో ఏంటి వసు అలా మాట్లాడుతున్నావు. ఎదురుగా రిషి సార్ ఉన్నారు చూశావా అని అడుగుతుంది పుష్ప. దీంతో చూశాను పుష్ప అంటుంది.

రిషి సార్ మీ మనసులో ఏముంది ఇప్పుడు. మాట్లాడుదామా వద్దా అని అనుకుంటుంది వసు. తన కారు దాటి వెళ్లబోతుంటుంది వసు. తనను చూస్తూ వెళ్తుంటుంది వసు. రిషి సార్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంటుంది. దీంతో ఆల్ ది బెస్ట్ వసుధర అని కళ్లతో చెబుతాడు రిషి.

Advertisement

Guppedantha Manasu 29 Aug Today Episode : రిషి సార్ ను పలకరించవా అని అడిగిన పుష్ప

ఏంటి వసుధర.. రిషి సార్ ను పలకరించవా అంటుంది పుష్ప. దీంతో పలకరించాలని నాకూ ఉంది కానీ.. పలకరించను అంటుంది పుష్ప. దీంతో ఎందుకు పలకరించకూడదు. నువ్వేదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు అంటుంది పుష్ప. దీంతో పరధ్యానం కాదు.. సార్ ధ్యానమే అంటుంది వసు. ఏంటి అనగానే ఏం లేదు అంటుంది వసు.

రిషి సార్ పక్కనే ఉన్నా మాట్లాడుకుండా వెళ్లడం అనేది నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం అని మనసులో అనుకుంటుంది వసు. ఇంతో రిషి ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేశా అని మెసేజ్ చేస్తాడు. దీంతో వెనక్కి తిరిగి సంతోషిస్తుంది వసు. ఇంతలో క్యాబ్ వస్తుంది.

జెంటిల్ మెన్ సార్ మీరు అని అనుకుంటుంది వసు. క్యాబ్ రాగానే ఇద్దరూ క్యాబ్ లో వెళ్లిపోతారు. మరోవైపు రిషి తన పెదనాన్నతో మాట్లాడుతాడు రిషి.. ఎగ్జామ్స్ అన్నింటికీ ఏర్పాట్లు జరుగుతున్నాయా అంటాడు. దీంతో ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ కోస హాలిడేస్ ఇచ్చాం కదా అంటాడు రిషి.

ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. గౌతమ్ కారు రెడీగా ఉందా అని అడుగుతుంది. దీంతో మేడమ్ ఏంటి.. బుక్స్ పట్టుకొని వచ్చింది. ఎక్కడికిరా అని అడుగుతాడు గౌతమ్ ను. దీంతో వసుకు ఈ పుస్తకాలు ఇద్దామని వెళ్తున్నా అని చెబుతుంది జగతి. నువ్వు వెళ్లి రావచ్చు కదా రిషి అని అంటాడు మహీంద్రా.

Advertisement

దీంతో ఆగురా నువ్వు నేను వెళ్తా అని అంటాడు. కానీ.. ఇంతలో ఎగ్జామ్స్ అయ్యేదాకా మనం మాట్లాడుకోవద్దు.. కలవకూడదు అని అన్న విషయం గుర్తుకు తెచ్చుకుంటాడు. గౌతమ్ నువ్వు వెళ్లిరా అని చెప్పి పైకి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది వసు.

రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తన ఇంటికి గౌతమ్, జగతి వస్తారు. పుస్తకాలు ఇచ్చారు. నువ్వే టాపర్ వు కావాలి అంటారు. కట్ చేస్తే రాత్రి అవుతుంది. ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి అని అనుకుంటుండగా రిషి వచ్చినట్టు కలగంటుంది. డోర్ తీసి రిషి వచ్చాడు అనుకుంటుంది.

మరోవైపు వసు ఇంటికి వచ్చినట్టు రిషి కూడా కలగంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి