Guppedantha Manasu 29 Dec Today Episode : తండ్రిని ఎదిరించి రిషిని పెళ్లి చేసుకోబోతున్న వసుధార.. రాజీవ్ ప్లాన్ ఏంటి? రిషిని ఏం చేస్తాడు? చంపేస్తాడా?

Advertisement
Advertisement

Guppedantha Manasu 29 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 646 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజీవ్ కు ఫోన్ చేస్తుంది దేవయాని. చెప్పిన పని ఏమైంది అని అడుగుతుంది. దీంతో ఆ ప్రేమ పావురాలు విడిపోవడం ఖాయం. ఇందాకే వాళ్లు కనిపించారు. ఇద్దరూ కారులో షికారు చేస్తున్నారు అంటాడు. దీంతో ఎదురు పడితే ఏం చేస్తున్నావు మరి అంటే.. చేయాల్సిందేదో చేస్తా మేడమ్. ఈ రాజీవ్ గాడిని తక్కువ అంచనా వేయకండి. నేను అసలే దెబ్బతిన్న సింహాన్ని అంటాడు. వాళ్ల ప్రేమను చెడగొట్టి.. వాళ్ళిద్దరినీ విడగొట్టి నా మరదలు మెడలో తాళి కడతాను. ఉంటాను మేడమ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రాజీవ్. మరోవైపు జగతి, మహీంద్రాకు కాఫీ తెచ్చి ఇస్తుంది ధరణి. వాళ్లను చూస్తుంది దేవయాని. మీరు ఏం జరగాలని ఆశిస్తున్నారో అది జరగదు.. జరగనివ్వను అంటుంది దేవయాని.

Advertisement

guppedantha manasu 29 december 2022 full episode

కట్ చేస్తే కారులో మళ్లీ వసుధారను తన ఇంటి వద్ద దింపుతాడు రిషి. వసుధార వెళ్లిపోబోతుండగా.. ఇంకా కొన్ని గంటలే కదా మన మధ్య దూరం అంటాడు రిషి. దీంతో ఆశిద్దాం సార్ అంటుంది. ఆశించడం ఏంటి.. నీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను అంటాడు రిషి. దీంతో నేను కూడా ఆ అపురూపమైన క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను అంటుంది వసుధార. ఇదిగో.. ఈ ఫోన్ నీ కోసమే అంటాడు రిషి. వెళ్తాను సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుండగా వసుధార కష్టంలో నష్టంలో ఎలాంటి పరిస్థితిలో అయినా నేను నీకున్నానని గుర్తు పెట్టుకో అంటాడు రిషి. వసుధార నా దగ్గర ఏమైనా దాస్తుందా అని అనుకుంటాడు  రిషి. మరోవైపు ఇంట్లో అలాగే కింద కూర్చొని ఉంటాడు చక్రపాణి. ఎందుకు ఏడుస్తున్నావే.. అలాంటి కూతురును ఎందుకు కన్నావనా.. లేక ఇలాంటి మొగుడిని ఎందుకు చేసుకున్నాననా.. ఎవడో సార్ అట.. పరిగెత్తుకుంటూ వెళ్లింది. రానీ దాని సంగతి చెబుతాను అంటాడు చక్రపాణి.

Advertisement

ఇంతలో వసుధార ఇంట్లోకి వస్తుంటుంది. ఆగు అంటాడు చక్రపాణి. అక్కడే ఆగు. ఎవడు వాడు అంటాడు. దీంతో నాన్న మర్యాద అంటుంది వసుధార. ఏంటి.. మర్యాదా. ఎవడే వాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు. నువ్వు ఎందుకు వెళ్లావు అని అడుగుతాడు. సమాధానం చెప్పాకే లోపలికి రా. చెప్పు.. ఎవడు వాడు అని అడుగుతాడు.

దీంతో నాకు కాబోయే భర్త అని గట్టిగా అరుస్తుంది వసుధార. దీంతో ఏమన్నావు అని మళ్లీ అడుగుతాడు. తను నాకు కాబోయే భర్త అంటుంది వసుధార. నాలిక చీరేస్తాను అంటాడు చక్రపాణి. దీంతో ఆగండి నాన్న.. అనవసరంగా తొందర పడకండి అంటుంది వసుధార.

ప్రతి చిన్నదానికి ఇలా అరవకండి. ప్రశాంతంగా వినండి. వచ్చింది రిషి సార్. మేమిద్దరం ఒకరిని మరొకరం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం అంటుంది. దీంతో అంతా మీ ఇష్టమేనా అంటే.. నా పెళ్లి నా ఇష్టం నాన్న అంటుంది వసుధార. రిషి సార్ వజ్రం లాంటి వారు. మంచి మనసు. పెద్ద కుటుంబం. వాళ్ల ఇంట్లో కూడా ఒప్పుకున్నారు అంటుంది వసుధార.

Guppedantha Manasu 29 Dec Today Episode : తన తండ్రితో గొడవ పెట్టుకున్న వసుధార

వాళ్లు ఒప్పుకుంటే సరిపోతుందా? మా ఇష్టాలతో పని లేదా అని అంటాడు. దీంతో నీ ఇష్టం ప్రకారం నువ్వు ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తావో నాకు తెలుసు. మంచి తేదీ చూసి చెప్పు అమ్మ. వాళ్లు వచ్చి సంబంధం మాట్లాడుతారు అని అంటుంది వసుధార. తండ్రి అంటే ప్రేమగా మాట్లాడాలి. కష్టం వస్తే ఓదార్చాలి. కన్నీళ్లు వస్తే తుడవాలి. నీకు నేనున్నాను అని చెప్పగలిగాలి. అంతే కానీ.. నేను చెప్పిందే వినాలి అంటే దాన్ని పెద్దరికం అనరు నాన్న అంటుంది వసుధార.

అక్కయ్యల పెళ్లిళ్లు అలాగే మెడలు వంచి చేశావు. ఇప్పుడు ఏమైంది.. ఒక అక్క చచ్చి బతికిపోయింది. ఇంకొక అక్క బతికి చస్తోంది. పెళ్లి విషయంలో మిమ్మల్ని ఎదిరించడం నాకు ఇష్టం కాదు. అది నా హక్కు. అక్కయ్యలా తల వంచుకొని నువ్వు చెప్పింది వినను. తాళి కట్టించుకోను. రిషి సార్ నా జీవితం. రిషి సార్ తోనే నా జీవితం అంటుంది వసుధార.

నువ్వు సెల్ ఫోన్ పగులగొట్టలవు. రిషి సార్ కొనిచ్చారు. ఫోన్ అయినా మనసులు అయినా బంధాలు అయినా బద్దలు కొట్టడం గొప్ప కాదు నాన్న. కలపడమే గొప్ప. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించడం గొప్ప అంటుంది వసుధార. దీంతో మేము వద్దన్నా కూడా వాడినే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు చక్రపాణి.

మీరు ఒప్పుకుంటే సరి.. లేదంటే అని అనబోతుంటే లేదంటే ఏం చేస్తావు అని అడుగుతాడు. దీంతో నేను ఒక గొప్ప కూతురుని కాకపోవచ్చు కానీ.. నేను రిషి సార్ ను నీకోసం వదులుకోలేను అంటుంది వసుధార. ఒక చెడ్డ కూతురు అని మీరు అనుకున్నా పర్వాలేదు. రిషి సార్ నే పెళ్లి చేసుకుంటాను అంటుంది వసుధార.

ఎందుకంటే.. తనతోనే నా జీవితం కాబట్టి అంటుంది వసుధార. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి డోర్ వేసుకుంటుంది వసుధార. మరోవైపు రిషి ఒక చోట కారు ఆపి.. అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తుంటాడు. వసుధార ఊరు ఇది. వసుధార తిరిగిన, పెరిగిన నేల ఇది. వసుధార నాతో శాశ్వతంగా ఉండబోతోంది అని అనుకుంటాడు రిషి.

వసుధారకు ఏమైంది అసలు. ఎందుకు అంత డల్ గా కనిపించింది. వసుధార నా దగ్గర ఏ విషయం అయినా దాస్తుందా? తను అలా చేయదు కదా అని అనుకుంటాడు రిషి. వసుధార నీకు ఏ కష్టం వచ్చినా ఈ రిషి ఉన్నాడు. రిషి ఎప్పటికీ నీకు అండగా ఉంటాడు. నువ్వు ఈ రిషి సొంతం. నువ్వు ఈ రిషి సొంతం. ఐలవ్యూ వసుధార అని గట్టిగా అరుస్తాడు.

మరోవైపు కొత్త ఫోన్ ను ఓపెన్ చేస్తుంది. అందులో అన్ని ఫోటోలు లేవని చూస్తుంటుంది. ఇంతలో సుమిత్ర తన దగ్గరికి వస్తుంది. మీ నాన్నతో అలా మాట్లాడొచ్చా అంటుంది సుమిత్ర. దీంతో నాన్నా అంటే గౌరవం ఉంది కానీ అన్నింటినీ గౌరవించలేం కదా. ఇది నా జీవితం అమ్మ అంటుంది వసుధార.

కావచ్చు కానీ.. మీ నాన్న పెళ్లికి ఒప్పుకోరు అంటుంది. దీంతో నువ్వు నాన్నకు నచ్చజెప్పు అంటుంది వసుధార. దీంతో నేనా అమ్మో అంటుంది సుమిత్ర. నీ ప్రయత్నం నువ్వు చేయి అమ్మ అంటుంది. ఒకసారి ఆలోచించు అంటుంది వసుధార. ఇదిగో చూడు అమ్మ. రిషి సార్ ఫోటో అని రిషి ఫోటోను చూపిస్తుంది వసుధార.

మహారాజులా ఉన్నాడమ్మా అంటుంది సుమిత్ర. మీ పెళ్లి ఎలా జరుగుతుందో.. ఎలాంటి సంబంధం వస్తుందో అని భయపడ్డాను అమ్మ. మొత్తానికి మంచే జరుగుతుంది అంటుంది సుమిత్ర. నాన్న మనం ఏం చెప్పినా వద్దనే అంటాడు కదా. కానీ నేను రిషి సార్ ను వదులుకోలేను. రిషి సార్ నాకోసం ఏం చేయడానికి అయినా వెనకాడరు.

నాన్న కోసం ఆలోచించి నా జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేసుకోవాలి. నేను ఎందుకు రిషి సార్ ను వదులుకోవాలి అని అంటుంది వసుధార. అమ్మ.. నేను ఏమన్నా తప్పుగా ఆలోచిస్తున్నానా? స్వార్థంగా ఉన్నానని అనిపిస్తోందా? అని అంటుంది వసుధార.

మీ నాన్నకు నేను చెప్పి చూస్తాను. ఆ తర్వాత భగవంతుడిదే భారం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సుమిత్ర. మరోవైపు రిషి.. దేవయానికి ఫోన్ చేస్తాడు. పెద్దమ్మ ఎక్కడున్నారు అని అడుగుతాడు. దీంతో ఇంట్లో అంటుంది. అది కాదు పెద్దమ్మ.. మీరు రూమ్ లో ఉన్నారా? లేక హాల్ లోనా అంటాడు.

దీంతో హాల్ లో అంటుంది. అందరినీ ఒకసారి పిలువు పెద్దమ్మ.. అని అంటాడు రిషి. దీంతో ధరణి.. ఒకసారి అందరినీ పిలువు.. రిషి ఫోన్ చేశాడు అని అంటుంది. దీంతో సరే అని అందరినీ పిలవడానికి వెళ్తుంది ధరణి. అందరూ వస్తారు. స్పీకర్ పెడుతుంది దేవయాని.

అందరూ ఉన్నారా? అంటే.. అందరం వచ్చాం అంటాడు ఫణీంద్రా. అందరూ వినండి.. వసుధార.. ఏ క్షణంలో అయినా మనల్ని రమ్మనొచ్చు. మీరందరూ బయలుదేరండి అంటాడు రిషి. నీ కాల్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం తెలుసా అని అంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

7 mins ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

1 hour ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

This website uses cookies.