Guppedantha Manasu 3 Dec Today Episode : గౌతమ్ తో ఫ్రెండ్ షిప్ కట్.. మహీంద్రా విషయంలోనూ షాకింగ్ నిర్ణయం తీసుకున్న రిషి

Advertisement
Advertisement

Guppedantha Manasu 3 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 624 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ లేదనుకురా అని రిషితో గౌతమ్ అన్నా కూడా వినడు రిషి. ఫ్రెండ్ షిప్ అనేది చాలా గొప్పపదం. దాన్ని నువ్వు వాడకు. ఇంకోసారి ఇక నిన్ను చూడను. మన స్నేహానికి గొప్ప బహుమతి ఇచ్చావురా అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. వసుధార కూడా వెళ్లిపోతుంది. ఇద్దరూ కారులో తిరిగి ఇంటికి బయలుదేరుతారు. చాలా టెన్షన్ గా ఉంటాడు రిషి. ఆవేశపడకండి సార్ అంటే.. నా గుండె మండిపోతోంది అంటాడు రిషి. తన ఫ్లాట్ లోనే పెట్టుకొని ఇంత ఇబ్బంది పెడతాడా అని అంటాడు. ఇందులో తప్పు ఒక్క గౌతమ్ సార్ దేనా.. అంటుంది వసుధార.

Advertisement

guppedantha manasu 3 december 2022 full episode

దీంతో ఏమన్నావు అని అడుగుతాడు రిషి. అవును సార్.. కొంచెం శాంతంగా ఆలోచించండి. ఇందులో తప్పు గౌతమ్ సార్ ది మాత్రమే ఉందా.. కాదు కదా. తప్పు జగతి మేడమ్ ది కూడా ఉ:ది. మహీంద్రా సార్ ది కూడా ఉంది కదా అంటుంది వసుధార. వాళ్లంటే కోపంతో వెళ్లారు.. నన్ను శిక్షించి వెళ్లారు. గౌతమ్ నా దగ్గర ఆ విషయం ఆపడం ఎందుకు అంటాడు రిషి. ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం కదా అంటుంది వసుధార. దీంతో వాడు నాకు ఎందుకు చెప్పకుండా ఉండాలి అంటాడు రిషి. మహీంద్రా సార్ ను కాదని మీకు చెబితే మహీంద్రా సార్ కొప్పడతారు కదా. ఆయన్ను దోషిగా నిలబెట్టిన వాళ్లు అవుతారు కదా అంటుంది వసుధార. గౌతమ్ సార్ ఒక్కరినే దోషిని చేయడం సమంజసంగా లేదు అంటుంది వసుధార. ఒకసారి ఆలోచించండి అంటుంది. దీంతో నిజాన్ని నా దగ్గర దాచడం గౌతమ్ చేసిన పెద్ద తప్పు. తప్పు కాదు ద్రోహం అంటాడు రిషి.

Advertisement

వెళ్లిపోయిందనుకున్న జగతి మళ్లీ వచ్చింది. వీళ్లేమో రాత్రిళ్లు షికార్లు కొడుతున్నారు. ఏదో ఒకటి చేయాలి. ఇలా వదిలేయకూడదు అని అనుకుంటుంది దేవయాని. ఇంతలో రిషి, వసుధార ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారు.

రిషి పైకి వెళ్లిపోతాడు. వసుధారను ఆపుతుంది దేవయాని. హలో.. ఏంటి వసుధార అప్పుడే వచ్చేశారేంటి అని అడుగుతుంది. మీరు ఎప్పుడో తెల్లవారుజామున వస్తారనుకున్నాను. లాంగ్ డ్రైవ్ కు వెళ్లారా? లాంగ్ డ్రైవ్ కు వెళ్తే ఇంత త్వరగా వస్తారా? లాంగ్ డ్రైవ్ అంటే దూర ప్రయాణం కదా అంటుంది.

చూస్తా.. ఎంత దూరం ప్రయాణిస్తావో అంటుంది దేవయాని. దీంతో మేడమ్ నన్ను వెళ్లనీయండి అంటుంది వసుధార. దీంతో వెళ్లు వసుధార. నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆపట్లేదు.. వెళ్లేటప్పుడు ఆపట్లేదు. అంతా నీ ఇష్టం నడుస్తోంది కదా అంటుంది. ఈ జగతి మళ్లీ వచ్చిందని నీకు బలం వచ్చింది కదా. జగతి ఇంట్లో ఉంటుంది నువ్వు బయట ఉంటావు. జగతి బయట ఉంటుంది నువ్వు ఇంట్లో ఉంటావు. సరే వసుధార. అలసిపోయి ఉంటావు. గుడ్ నైట్.

ఈసారి లాంగ్ డ్రైవ్ కు వెళ్లే తినడానికి ఏదైనా చేసి ఇస్తాను. అయినా లాంగ్ డ్రైవ్ లో రోడ్డు మీద అన్నీ దొరుకుతాయి కదా. సరే నువ్వు వెళ్లి పడుకో.. అంటుంది. దేవయాని ఏంటి మళ్లీ ఏదైనా ప్లాన్ చేసిందా అని అనుకుంటుంది వసుధార.

Guppedantha Manasu 3 Dec Today Episode : మహీంద్రాతో మాట్లాడిన రిషి

రూమ్ లోకి వెళ్లి మహీంద్రాతో మాట్లాడాలని అనుకుంటాడు రిషి. కానీ.. డాడ్ నిద్రపోతున్నట్టున్నాడు. రేపు మాట్లాడుదాం అని అనుకుంటాడు. ఇంతలో మహీంద్రా లేచి రిషి లోపలికి రా అంటాడు. ఏంటి రిషి.. ఈ అవతారం ఏంటి అని అడుగుతాడు.

దీంతో షర్ట్ పాడయింది. గౌతమ్ దగ్గరికి వెళ్లాను.. అంటాడు రిషి. దీంతో ఏం జరిగింది నాన్న అంటాడు. ప్రేమ అంటే ఏదీ దాచుకోకపోవడం కదా అంటాడు రిషి. దీంతో ఏం మాట్లాడుతున్నావు రిషి అంటాడు. దీంతో గౌతమ్ ఇంట్లో మీరు ఉండటం గురించి అంటాడు రిషి.

నాకు తెలిసిపోయింది డాడ్ అంటాడు రిషి. ఒక్క విషయం చెప్పడానికి, తెలియడానికి చాలా తేడా ఉంటుంది డాడ్ అంటాడు. మీరు ఎక్కడున్నారని నేను అడగలేదు. మీరూ చెప్పలేదు కానీ.. గౌతమ్ నా ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి ఫ్రెండ్. వాడు కూడా ఇలా మోసం చేశాడు అంటాడు.

నిజం చెబితే తనను అంటూ మహీంద్రా ఏదో చెప్పబోతుండగా.. వాడిని సమర్థించకండి. ఒక ఫ్రెండ్.. ఇంకో ఫ్రెండ్ ను సమర్థించడం క్షమించరానిది అంటాడు రిషి. దీంతో నిజం దాచాడు. అంతే మోసం చేయలేదు అంటాడు మహీంద్రా.

దీంతో నిజం దాచడం అనేది పెద్ద మోసం అంటాడు రిషి. నా బాధ తగ్గించాలి కదా. ఒక ఫ్రెండ్ గా వాడికి బాధ్యత లేదా అంటాడు. దీంతో ఈ విషయంలో తప్పు నాది కూడా ఉంది కదా. పాపం గౌతమ్ ను ఏమీ అనకు అంటాడు మహీంద్రా.

దీంతో ఈ విషయంలో నేను మిమ్మల్ని ప్రశ్నించను.. గౌతమ్ ను ఎప్పటికీ క్షమించను అంటాడు రిషి. నా వల్ల బాల్య స్నేహాన్ని వదులుకోకు అంటాడు. దీంతో ఇలా నిజాలు దాచిపెడితే ఫ్రెండ్ ఎలా అవుతాడు డాడ్ అంటాడు రిషి.

మమ్మల్ని గౌతమ్ ఎంత బాగా చూసుకున్నాడో తెలుసా? ఇక్కడ నీ మనసు అర్థం చేసుకొని నీకు తోడుగా ఉండే వసుధార.. అక్కడ అస్తమానం నీ గురించే ఆలోచించే మీ అమ్మ.. అదే జగతి, తనిప్పుడు నీ సౌకర్యం గురించే ఆలోచిస్తోంది.

గౌతమ్ కూడా నీకు మంచి ఫ్రెండ్. ఇంత మంది మంచివాళ్లు నీ గురించి ఆలోచించేవాళ్లు నీ చుట్టూ ఉండటం అదృష్టం కదా అంటాడు మహీంద్రా. దీంతో గౌతమ్ చేసిన దానికి ఇంకా నా మనసు ఒప్పుకోవడం లేదు అంటాడు.

తను నాకు చెప్పాలి కదా. చెబితే కొడతానో, తిడతానో, క్షమిస్తానో అది తర్వాత విషయం కదా అంటాడు రిషి. దీంతో ఇంత చిన్న విషయానికే ఫీల్ అవుతున్నావా అంటాడు మహీంద్రా. దీంతో ఇది చిన్న విషయం కాదు అంటాడు రిషి.

ఇదంతా నా తప్పు. నేను వెళ్లకుండా ఉంటే ఇలా జరిగేదే కాదు కదా. వసుధారను ఏదో నేను గురుదక్షణ అడిగాను. కానీ.. తను ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. నేను ఒకటి అనుకుంటే తను ఇంకోటి అనుకుంది.

మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని అనుకున్నా. నావల్ల జరిగిన తప్పును నేనే సరిదిద్దుకోవాలని అనుకున్నా అంటాడు మహీంద్రా. కారణాలు ఏవైనా నేను ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. నేను కొన్నాళ్లు దూరం అయితేనే నువ్వు, వసుధార దగ్గరవుతారని అనిపించింది.

అందుకే జగతి వద్దన్నా వినలేదు అంటాడు మహీంద్రా. బయటికెళ్లాం కానీ.. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. గౌతమ్ మాకు ఆశ్రయం ఇచ్చాడు. చాలా బాగా చూసుకున్నాడు. పాపం రిషి.. గౌతమ్.. ఈ విషయం రిషికి తెలిస్తే ఎలా అంటూ ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉండేవాడు అంటాడు.

పాపం గౌతమ్ ను క్షమించు అంటాడు మహీంద్రా. కానీ.. రిషి మాత్రం ఏం మాట్లాడుకుండా.. పడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…

51 mins ago

Bigg Boss Telugu 8 : మెగా చీఫ్‌గా చివ‌రి అవ‌కాశం.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి ద‌గ్గ‌ర ప‌డింది. టాప్ 5కి ఎవ‌రు వెళ‌తారు,…

1 hour ago

Google Sundar Pichai : డొనాల్డ్ ట్రంప్‌కు గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ ఫోన్.. కాల్‌లో జాయిన్ అయిన ఎలాన్ మ‌స్క్ !

Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…

3 hours ago

India : నిజ్జ‌ర్ హ‌త్యపై కెనడా మీడియా చెత్త క‌థ‌నం.. పూర్తిగా ఖండించిన భార‌త్..!

India  : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…

4 hours ago

Bank Account : ఎక్కువ రోజులు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. ఇలా చేయాల్సిందే..!

Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…

5 hours ago

Periods : పీరియడ్ సక్రమంగా రావట్లేదని ఆందోళన పడుతున్నారా… అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే…??

Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…

6 hours ago

Bobby : చిరంజీవి గారికి, బాల‌కృష్ణ గారికి తేడా ఇదే అని చెప్పిన బాబీ..!

Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మారాడు. ప‌వ‌ర్ సినిమాకి బాబీ…

7 hours ago

Sleep : రాత్రి టైంలో లో దుస్తులు లేకుండా పడుకుంటే… ఎన్ని లాభాలో తెలుసా…!!

Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…

7 hours ago

This website uses cookies.