
guppedantha manasu 3 september 2022 full episode
Guppedantha Manasu 3 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 సెప్టెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 546 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధర ఎలాగోలా పరీక్ష హాల్ కు వచ్చి కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. దీంతో ఎస్ దటీజ్ వసుధర అని అనుకుంటాడు రిషి. ఇంతలో మహీంద్రా వచ్చి వసుధర ఎగ్జామ్ రాయగలదు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అంటాడు మహీంద్రా. మొత్తానికి వసుధర ఎగ్జామ్ రాయడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అసలు వసుధరకు ఏమైంది. ఎందుకు ఎగ్జామ్ కు లేట్ గా వచ్చింది అని మహీంద్రా జగతిని కాఫీ షాపులో అడుగుతాడు. దీంతో ఏమైందో తెలియదు అంటుంది జగతి. వసుధర వెనుక ఏదో జరుగుతోందని నాకు డౌట్ గా ఉంది జగతి అంటాడు మహీంద్రా. దీంతో నాక్కూడా అంటుంది జగతి. అక్కయ్య గారు గతంలా ప్రవర్తించడం లేదు అంటుంది జగతి. మొత్తానికి ఏదో జరుగుతోందన్న విషయం నాకూ అర్థం అవుతోంది మహీంద్రా అంటుంది జగతి. రిషిని అంతగా కావాలనుకున్న సాక్షి రిషిని మరిచిపోతుందని నేను అనుకోవడం లేదు అంటుంది జగతి.
guppedantha manasu 3 september 2022 full episode
సాక్షి వైపు నుంచి రిషికి ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉందా అంటాడు మహీంద్రా. దీంతో అవును అంటుంది జగతి. ఏది ఏమైనా రిషి, వసు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరి పెళ్లి త్వరగా చేసేద్దాం అంటాడు మహీంద్రా. దూకుడుగా ముందడుగు వేయకపోతే కుదిరేలా లేదు అంటాడు మహీంద్రా. దీంతో వాళ్ల పెళ్లికి బాగా తొందరపడుతున్నట్టున్నారు అంటుంది జగతి. ఇంతలో అక్కడికి వచ్చిన గౌతమ్.. అంకుల్ నాకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. త్వరగా వసుధర, రిషికి పెళ్లి చేద్దాం అంటాడు గౌతమ్. దీంతో మహీంద్రా, జగతి షాక్ అవుతారు. మేము కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తున్నాం అంటాడు మహీంద్రా. మరోవైపు కాఫీ ఆర్డర్ చేశారా అంటాడు గౌతమ్. దీంతో వసుధర ఈరోజు రానని చెప్పింది అంటుంది మరో వెయిటర్.
రిషి గాడు ఎక్కడున్నాడో తెలియదు.. వసుధర రెస్టారెంట్ కు రాలేదు. దీని అర్థం ఏంటి అంటాడు గౌతమ్. దీంతో బాబూ గౌతమ్. నాకు మాత్రం ఏం తెలుసు. పక్షులు విహారం చేస్తున్నట్టున్నాయి అంటాడు మహీంద్రా. ఎగ్జామ్స్ అయిపోయాక చాలా సంతోషంగా ఉంటుంది వసుధర.
ఇంతలో వసు దగ్గరికి రిషి వస్తాడు. దీంతో తన చేతులు పట్టుకొని గిరగిరా తిరుగుతూ ఉంటుంది. దీంతో వసుధర ఆగు అంటాడు. ఎగ్జామ్స్ అయిపోవడంతో ఒప్పుల కుప్ప వయ్యారి బావ ఆట ఆడుతున్నాం సార్ అంటుంది వసుధర. సార్.. మీరేంటి ఇలా సడెన్ గా వచ్చారు అంటుంది వసు.
అసలేంటి నువ్వు.. ఏం జరిగిందో నీకు ఏమైందో అని టెన్షన్ పడుతుంటే కుప్పల కుప్ప ఆట ఆడుకుంటున్నావా అంటాడు రిషి. ఎగ్జామ్స్ బాగానే రాశాను కదా సార్ అంటుంది వసుధర. అసలు నువ్వు ఆ స్టోర్ రూమ్ లో ఎలా పడిపోయావు. అంత మత్తులో ఎందుకు ఉన్నావు. అసలు వచ్చిందెవరు అని అడుగుతాడు రిషి.
ఇది సాక్షి పని అయి ఉంటుంది అని రిషి సార్ కు చెబితే ఇంకేమైనా ఉందా. అందుకే రిషి సార్ కు ఈ విషయం చెప్పను. నేనే సాక్షి సంగతి చూసుకుంటాను అని మనసులో అనుకొని వాళ్లెవరో నాకు తెలియదు సార్ అంటుంది వసు. నేను ఎగ్జామ్ రాయొద్దని సాక్షి అనుకుందా.. లేక నన్ను ఏమైనా చేయాలని అనుకున్నారా అని అనుకుంటుంది.
జరిగింది ఏంటో తెలుసుకోవాలని ఇలా చేశాను. సరే.. ఆ విషయం వదిలేద్దాం. పదా వెళ్దాం అంటాడు రిషి. కట్ చేస్తే రిషి, వసు ఫోటోలు చూస్తూ ఖుషీ అవుతాడు మహీంద్రా. ఈ జంట ఎంత బాగుందో కదా అని అనుకుంటాడు మహీంద్రా. మరోవైపు తమ ప్లాన్ ఫెయిల్ అయిందని టెన్షన్ పడుతుంది దేవయాని.
ఇంతలో సాక్షి ఫోన్ చేస్తుంది. నేను చేయాల్సిందంతా చేశాను. ఎలా కనిపెట్టారో తెలియదు అంటుంది సాక్షి. వసుధరను ఎక్కడో దాచిపెట్టమంటే ఎక్కడే కాలేజీలో ల్యాబ్ లో పడేస్తే ఏం లాభం అంటుంది దేవయాని. పనులు అందరూ చేస్తారు. పర్ ఫెక్ట్ గా కొందరే చేస్తారు. నీలో ఆ పర్ ఫెక్షన్ లేదు.
నీకు తెలివితేటలు ఉంటే.. నువ్వు కరెక్ట్ గా ఉంటే ఎంగేజ్ మెంట్ అయ్యాక రిషి నిన్ను ఎందుకు వదులుకుంటాడు. రెండోసారి నువ్వు రిషిని వదులుకున్నావు. నీ తెలివితేటలు ఇలా తగలబడ్డాయి. ఎగ్జామ్స్ అయిపోయాయి. వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని సాక్షి మీద సీరియస్ అవుతుంది దేవయాని.
మీరు టెన్షన్ పడకండి ఆంటి అంటుంది సాక్షి. వసుధరకు లక్ బాగుంది. అందుకే చివరి నిమిషంలో రిషి చూశాడు. రిషి మంచితనమే మనకు ఆయుధంగా ఉపయోగపడుతుంది. తన ప్రేమనే క్షణాల్లో ద్వేషంగా మార్చొచ్చు. అదేదో అంటారు కదా ఆంటి అంటుంది సాక్షి.
ఒక చిన్న అవకాశం చాలు.. రిషి, వసుధరను విడదీయడానికి అంటుంది సాక్షి. రిషిని డిస్టర్బ్ చేసే అవకాశం మీరు వెతకండి. వసుధరను వెళ్లగొట్టే దారి నేను వెతుకుతాను అంటుంది సాక్షి. రిషిని వసుధర కాదు కదా.. ఎవ్వరికీ దక్కకుండా చేస్తాను అని అనుకుంటుంది సాక్షి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.