Guppedantha Manasu 30 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 ఆగస్టు 2022, మంగళవారం ఎపిసోడ్ 542 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి ఇంటికి వసుధర వచ్చినట్టు ఊహించుకుంటాడు రిషి. మరోవైపు రిషి.. తనకు కాల్ చేయాలా అని అనుకుంటాడు. వసుధర కూడా రిషికి కాల్ చేయాలా అని అనుకుంటుంది. ఇంతలో రిషి వాట్సప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు. అందులో జగతి మేడమ్ ను కూడా యాడ్ చేస్తాడు. ఇంతలో రిషికి గుడ్ ఐడియా సార్ అని మెసేజ్ చేస్తుంది వసు. పుష్ప కూడా ఆ గ్రూప్ ను చూస్తుంది. అందరికీ వచ్చే డౌట్స్ ఇందులో అడగొచ్చా సార్ అని మళ్లీ వసు పెడుతుంది. దీంతో ఏ డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా అడగొచ్చు. మీ లక్ష్యమే మీకు ముఖ్యం అన మెసేజ్ పెడతాడు రిషి. నాకోసమే ఈ మెసేజ్ రిషి సార్ పంపారు అని అనుకుంటుంది వసు.
ఈ మెసేజ్ వసుకు మాత్రమే అని అనుకుంటుంది జగతి. ఎవ్వరికీ తెలియకుండా చాటింగ్ చేసుకుంటున్నారా.. బాగుంది అని అనుకుంటుంది జగతి. భోజనం చేశారా.. టైమ్ కు తినండి.. హెల్త్ కాపాడుకోండి అని మెసేజ్ పెడతాడు రిషి. దీంతో ఓకే సార్ అంటుంది వసుధర. మరోవైపు గౌతమ్, మహీంద్రా, జగతి ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి, వసు ఇద్దరూ ఇలా అయితే ఎలా కలుస్తారు అని అంటాడు గౌతమ్. కానీ.. ఏదో జరుగుతోంది… అంటాడు మహీంద్రా. దీంతో మనకు తెలియకుండా పెద్ద కుట్ర నడుస్తోంది అంటాడు గౌతమ్. జగతి ఫోన్ చూస్తుంటే.. ఏదో చెబుతా అని ఇప్పుడు ఫోన్ చూసుకుంటున్నావేంటి అంటాడు మహీంద్రా. దీంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పేరుతో గ్రూప్ స్టార్ట్ చేశాడు రిషి. అందులో ఇద్దరూ చాట్ చేసుకుంటున్నారు అని అసలు విషయం చెబుతుంది జగతి.
వాళ్ల చాట్ మొత్తాన్ని చూపిస్తుంది జగతి. మా ఇంట్లో కరెంట్ పోయింది ఫ్రెండ్స్ అని ఇప్పుడే వసు గ్రూప్ లో మెసేజ్ పెట్టింది అని అంటుంది జగతి. దీంతో ఇప్పుడు చూడు.. వెంటనే కారు తీసుకొని రిషి వెళ్లిపోతాడు అంటాడు మహీంద్రా. గౌతమ్ వెళ్లి చూడగానే నిజంగానే రిషి కారులో వెళ్తుంటాడు. దీంతో జగతి షాక్ అవుతుంది.
మరోవైపు కరెంట్ లేదు.. ఎలా చదువుకోవాలి అని టెన్షన్ పడుతుంది వసు. దీంతో వెన్నెల పడుతుందని బయటికి వస్తుంది. చందమామతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రిషి వస్తాడు. కారు లైట్స్ ఆన్ చేసి పెడతాడు. చదువుకో అంటాడు. దీంతో షాక్ అవుతుంది వసు.
నాకోసం వచ్చారా? కరెంట్ పోయిందని గ్రూప్ లో నేను మెసేజ్ పెడితే వచ్చి కారు లైట్స్ పెట్టారా? థాంక్స్ రిషి సార్ అని మనసులో అనుకుంటుంది వసు. తన చదువు పూర్తయ్యాక.. ఒక లెటర్ రాసి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతుంది వసు. కట్ చేస్తే పరీక్షల సమయం వచ్చేస్తుంది.
పరీక్ష మొదటి రోజు స్టార్ట్ అవుతుంది. కాలేజీకి వచ్చిన రిషి.. అందరూ పరీక్షకు బాగా ప్రిపేర్ అయ్యారా అని అడుగుతాడు రిషి. దీంతో ప్రిపేర్ అయ్యాం సార్ అంటారు అందరూ. అందరితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి కేవలం వసుకు అర్థం అయ్యేట్టుగా మాట్లాడుతాడు రిషి.
తర్వాత తన బ్యాగులో పెన్నును పెడతాడు రిషి. ఎగ్జామ్స్ కోసం పెట్టిన గ్రూప్ లో అందరూ యాక్టివ్ గా ఉండండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. మంచిగా మార్క్స్ తెచ్చుకోండి అంటాడు. ఆల్ ది బెస్ట్ చెబుతాడు అందరికీ. వసుకు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతాడు.
తర్వాత బ్యాగులో రిషి సార్ పెట్టిన పెన్నును చూస్తుంది వసుధర. పెన్నుతో పాటు ఒక చిన్న లెటర్ ను కూడా పెడతాడు రిషి సార్. మనసు మాట్లాడమంటోంది. షరతు వద్దంటోంది. నీ లక్ష్యమే నీ గమ్యం. ఎగ్జామ్స్ బాగా రాయి. ఆల్ ది బెస్ట్ అని కాగితంలో రాసి పెడతాడు రిషి.
థాంక్యూ సార్ అని అంటుంది వసు. మీరు జెంటిల్ మెన్ సార్ అని అనుకుంటుంది వసు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.